Anchor Vishnu priya : నాకు అలాంటివే ఇష్టం.. యాంకర్ విష్ణుప్రియ
Anchor Vishnu priya యాంకర్ విష్ణు సోషల్ మీడియాలో ఎంతగా చెలరేగుతోందో అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో విష్ణుప్రియ చేసే అల్లరి మామూలుగా ఉండదు. ఆమె చేసే అందాల ప్రదర్శనకు అందరూ నోరెళ్లబెడుతుంటారు. ఓ వైపు దైవచింతనలో ఉన్నానని చెబుతూ.. మరో వైపు అందాల ఆరబోత చేస్తుంటుంది. ఇక ఇప్పుడు విష్ణుప్రియ రుద్ర ఫౌండేషన్ అని పెట్టి దాని ద్వార ఎంతో మందికి సాయం చేస్తున్న సంగతి తెలిసిందే. అలాంటి విష్ణుప్రియకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది.

Anchor Vishnu priya About Listing Songs
అయితే ఈ మధ్య శ్రీముఖికి, ఆమె గ్యాంగుకు విష్ణుప్రియ దూరంగా ఉన్నట్టు కనిపిస్తోంది. తన పని ఏదో తాను చూసుకుంటూ బిజీగా ఉంది. వర్కవుట్లు, యోగా, జిమ్ సెషన్‌లతో విష్ణుప్రియ ఫుల్ బిజీగా ఉంది. అవినాష్ పెళ్లిలో కూడా విష్ణుప్రియ కనిపించలేదు. అటు పెళ్లి జరుగుతూ ఉంటే.. ఇటు విష్ణుప్రియ మాత్రం వర్కవుట్లు చేస్తూ బిజీగా గడిపింది. తాజాగా విష్ణుప్రియ ఓ సర్వే మీద స్పందించింది. పాటలు, బ్రెయిన్‌కు ఉన్న సంబంధం మీద కామెంట్ చేసింది.
Anchor Vishnu priya స్కూల్‌లో అలాంటి పాటలు విన్న విష్ణుప్రియ

Anchor Vishnu priya About Listing Songs
చిన్నప్పుడు హై స్కూల్‌లో మనం ఎలాంటి పాటలు వింటామో.. మన బ్రైన్ కూడా అలానే మారుతుంది. ఏ మ్యూజిక్ వింటే దానిలా బ్రెయిన్ మారుతుందట. అలా విన్నప్పుడు మన బ్రెయిన్‌లో డోపమైన్ వంటివి రిలీజ్ అవుతాయి.. మంచి రసాయన పదార్థాలు విడుదలవుతాయట. అవన్నీ కూడా యంగ్ ఏజ్‌లో రిఫ్లెక్ట్ అవుతాయట. ఇది ఓ సర్వేలో తేలిదందట. దీనిపై యాంకర్ విష్ణుప్రియ స్పందించింది. నాకు అయితే స్కూల్ ఏజ్‌లో డించక్ డించక్ సాంగ్స్ అంటే ఇష్టమని చెప్పుకొచ్చింది.