Shriya : నడి రోడ్డు మీద శ్రియ కొంటె పనులు.. నీ వయసెంత అంటు భర్త కౌంటర్లు

Authored By Cinema Desk | The Telugu News | Updated on: September 23, 2021, 11:09 pm

శ్రియ, ఆండ్రూ కొశ్చివ్ చేసే పనులు సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అవుతుంటాయో అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరి ముద్దూ ముచ్చట్లు, ఎద అందాలను కొరకడాలు నెట్టింట్లో హాట్ టాపిక్ అవుతుంటాయి. ఈ ఇద్దరూ కలిసి చేసే రొమాన్స్‌ను నెట్టింట్లో అందరినీ చూపిస్తుంటారు. అలా శ్రియ అందాలు అందరినీ కట్టిపడేస్తుంటాయి. ఇక ఆమె భర్త ఆండ్రూ సైతం శ్రియా అందాలను తన కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో వదులుతాడు.

andrei koscheev Fun with Shriya

andrei koscheev Fun with Shriya

రోడ్డు మీద శ్రియ రచ్చ Shriya

ఈ మధ్యే ఈ జంట రష్యాను వదిలి ముంబైకి షిఫ్ట్ అయింది. ముంబైలో ఓ కొత్త ఇళ్లు కూడా తీసుకున్నారు. ఆ తరువాత తిరుమలలో శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లారు. అలా మొత్తానికి ఈ జంట మాత్రం ఇండియాలోనూ రచ్చ రచ్చ చేస్తోంది. అయితే తాజాగా ముంబైలో ఫుల్ వర్షం పడ్డట్టుంది. ఇక రోడ్డు మీదే నీళ్లు అలా నిలిచిపోయినట్టున్నాయి. చిన్నప్పుడు అలా రోడ్డు మీద నీళ్లు నిల్చుని ఉంటే.. ఎగిరి వాటి మీద జంప్ చేసేవాళ్లం. అలా నీళ్లన్నీ కూడా పక్కకు జంప్ అయ్యేవి.

andrei koscheev Fun with Shriya

andrei koscheev Fun with Shriya

ఇప్పుడు శ్రియా కూడా చిన్నపిల్లలా మారిపోయింది. రోడ్డు మీద ఉన్న నీళ్లపై జంప్ చేసింది. అలా జంపులు చేస్తుంటే శ్రియ భర్త ఆమెను కెమెరాలో బంధించాడు. నీ వయసు ఎంత ఇప్పుడు అని కౌంటర్లు వేశాడు. అయినా కూడా శ్రీయా వినకుండా గెంతులు వేస్తూనే ఉంది. మొత్తానికి శ్రియ అల్లరిని ఆండ్రూ బాగానే భరిస్తోన్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం ఆండ్రూ షేర్ చేసిన ఈ వీడియో వైరల్ అవుతోంది. శ్రియ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్, గమనం అనే చిత్రాలతో బిజీగా ఉంది.

 

andrei koscheev Fun with Shriya

andrei koscheev Fun with Shriya

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp