Shriya : ఏంద‌మ్మి ఆ తిప్పుడు.. నాలుగు ప‌దుల వ‌య‌స్సులోను మ‌త్తెక్కిస్తున్నావుగా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Shriya : ఏంద‌మ్మి ఆ తిప్పుడు.. నాలుగు ప‌దుల వ‌య‌స్సులోను మ‌త్తెక్కిస్తున్నావుగా..!

 Authored By sandeep | The Telugu News | Updated on :2 October 2022,11:00 am

Shriya : ఒక‌ప్పుడు త‌న అంద‌చందాల‌తో కుర్ర‌కారు మ‌తులు పోగొట్టిన అందాల ముద్దుగుమ్మ శ్రియ‌. సౌత్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఒకప్పుడు అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్నఈ అమ్మ‌డు వైవిధ్య‌మైన సినిమాలు చేసేది. ఎలాంటి సినిమా చేసిన కూడా బాక్సాఫీస్ వద్ద మినిమం ఓపెనింగ్స్ అందుకునేవి. ఇష్టం అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శ్రీయ ఆ తర్వాత వరుసగా హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుని ఇండస్ట్రీకి వచ్చి అనతి కాలంలోనే స్టార్ హీరోలతో జతకట్టి .టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. ఇప్ప‌టికీ అడ‌పాద‌డపా న‌టిస్తూనే సంద‌డి చేస్తుంది.

2018లో శ్రియ శరన్ ఆండ్రీ కోస్చీవ్ అనే విదేశీయుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. గత ఏడాది ఇక పండంటి ఆడపిల్లలకు కూడా జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఇక ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో కూడా తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను షేర్ చేసుకుంటూ ఉంటుంది. కూతురు రాధతో రోమ్‌ వీధుల్లో చక్కర్లు కొడుతోన్న సమయంలో తీసిన వీడియోను, అలాగే పాపను ఆడిస్తూ ట్రెడిషనల్‌ డ్రస్‌లో ఉన్న ఓ వీడియోను పోస్ట్‌ చేసింది. ఆ వీడియోని చూసి నెటిజన్స్ మైమ‌ర‌చిపోయారు. కూతురికి సమయం కేటాయిస్తూ అటు కెరీర్‌ను ఇటు మధర్‌ హుడ్‌ను బ్యాలెన్స్‌ చేస్తున్న శ్రియ నిజంగానే గ్రేట్‌ కదూ అని అన్నారు.

shriya saran beautiful looks

shriya saran beautiful looks

Shriya : మ‌త్తెక్కించే అందం…

శ్రియ తాజాగా ష్యాష‌న్ వీక్ లో క‌నువిందు చేసింది.. స్టైలిష్ డ్రెస్‌లో తెగ ఊపేస్తూ నానా ర‌చ్చ చేసింది. శ్రియని ఇలా చూసి ప్ర‌తి ఒక్క‌రు మైమ‌ర‌చిపోతున్నారు. ఏమందం అమ్మ‌డు ఇది అంటూ క్యూట్ కామెంట్స్ చేస్తున్నారు. కెరియర్ పిక్స్ లో ఉన్నప్పుడే శ్రియ ఈ రష్యన్ ని పెళ్లి చేసుకునేసింది. రష్యన్ లో ఆమె తన భర్తతో చేస్తున్న హంగామాను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేస్తూనే ఉంది . రీసెంట్ గా ఆమె RRR లు కూడా అజయ్ దేవగన్ భార్యగా మంచి పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా ద్వారా ఆమెకు మంచి గుర్తింపు రావడంతో మరిన్ని అవకాశాలు కూడా వస్తున్నాయి.

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది