Home » Entertainment » Anil Ravipudi Satires On Dhan Raj In Comedy Stars Dhamaka
Entertainment

Anil Ravipudi : కామెడీ స్టార్స్ షోలో ‘ఎఫ్’ గోల.. ధన్‌రాజ్‌కు అనిల్ రావిపూడి పంచ్

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: May 19, 2022, 12:30 pm
Advertisement

Anil Ravipudi : ఎఫ్ అనే పదం ఈ మధ్య ఎక్కువగా ట్రెండ్ అయింది. విశ్వక్ సేన్ దేవీ నాగవల్లి ఇష్యూ తరువాత ఈ ఎఫ్ అనే పదం మరింతగా వైరల్ అయింది. అయితే ఈ ఎఫ్ అనే పదానికి ఉన్నద్వంద్వార్థం గురించి విడమరిచి చెప్పాల్సిన పనిలేదు. అడల్ట్ కంటెంటె్‌లో ఈ పదాన్ని తరుచుగా వాడుతుంటారు. అయితే ఈ ఎఫ్ అనే పదంలోని డబుల్ మీనింగ్ డైలాగ్‌తో ధన్ రాజ్ రెచ్చిపోయాడు. దర్శకుడు అనిల్ రావిపూడిని అందరి ముందు ఇరికించే ప్రయత్నం చేశాడు. అసలే ఇప్పుడు అనిల్ రావిపూడి ఎఫ్ 3 ప్రమోషన్స్‌లో ఉన్నాడు.ఎఫ్ 2 ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ అంటూ తీసిన సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.

Advertisement

అయితే ఇప్పుడు ఎఫ్ 3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నాడు. సినిమా వచ్చే వారం విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ తన భుజాల మీద వేసుకున్నాడు. అందుకే బుల్లితెరపై అన్ని షోల్లో కనిపిస్తున్నాడు. సుమ క్యాష్ షో, జబర్దస్త్ షో, నాగబాబు కామెడీ స్టార్స్ ఇలా అన్ని షోల్లోనూ అనిల్ రావిపూడి కనిపిస్తున్నాడు. మొత్తానికి నాగబాబు షోలో జడ్జ్‌గా ఈ ఒక్క వారం కామెడీ షోను చూసేశాడు.అందులో ధన్ రాజ్ డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. పరమనాటుగా డబుల్ మీనింగ్ డైలాగ్స్ వేస్తుంటాడు ధన్ రాజ్.

Anil Ravipudi Satires On Dhan Raj In Comedy Stars Dhamaka

Advertisement

ఇలానే అనిల్ రావిపూడి ముందు కూడా డైలాగ్ వేసేశాడు. ఎఫ్ 3 ట్రైలర్ చూశాం.. చూడగానే బ్లాక్ బస్టర్ హిట్ అని అర్థమైంది సర్.. ఎఫ్ 4 కూడా తీస్తున్నారని బయట టాక్ సర్.. అసలు మీకు ఎఫ్ గోల ఏంటి? మీకు ఎఫ్ అంటే అంత ఎందుకు ఇష్టం.. అసలు ఎఫ్ అంటే ఏంటి.. అని ఇలా పదే పదే ఎఫ్ అనే పదాన్ని నొక్కి వక్కాణించాడు.దీనిపై అనిల్ రావిపూడి స్పందించాడు. నువ్ అనుకునే అనారోగ్యకరమైన ఎఫ్ కాదు.. ఆరోగ్యకరమైన ఎఫ్.. ఎఫ్ అంటే ఫ్యామిలీ అని కౌంటర్ వేశాడు అనిల్ రావిపూడి. నేను కూడా అదే అన్నాను సర్ అని ధన్ రాజ్ కవర్ చేసేందుకు ప్రయత్నించాడు. మొత్తానికి ఎఫ్ అనే పదం మాత్రం ఈ మధ్య వైరల్ అవుతూనే ఉంది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి