jabardasth comedian gets father promotion
Jabardasth : జబర్ధస్త్ కామెడీ షోతో ఎంతో మంది ఆర్టిస్ట్‌లు లైమ్ లైట్‌లోకి వచ్చారు. ఇప్పుడు వారు సెలబ్రిటీలుగా చలామణి అవుతున్నారు.అంతేకాదు సొంత ఇల్లు, కారు కొనుక్కొని సెటిల్ అయ్యారు. అయితే జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో జబర్దస్త్ వినోద్ ఒకరు. ముఖ్యంగా లేడీ గెటప్స్ లో చమ్మక్ చంద్ర స్కిట్లలో వినోద్ చేసే పర్‌ఫార్మెన్స్ హైలైట్ అని చెప్పుకోవచ్చు. జబర్ధస్త్ షోలోనే కాకుండా బయట జరిగే ఈవెంట్లకు కూడా ఆడవేషాలతోనే వెళ్తుంటాడు. దీంతో అతడికి ఫాలోయింగ్ కూడా భారీగా పెరిగిపోయింది.జబర్దస్త్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వినోద్ తన భార్య విజయతో కలిసి బుల్లితెరపై ప్రసారమవుతున్న క్యాష్ దొరికినంత దోచుకో కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ కార్యక్రమానికి వినోద్ తో పాటు పలువురు జబర్దస్త్ కమెడియన్స్ కూడా హాజరయ్యారు.జబర్దస్త్ వినోద్ తన భార్య విజయతో ఈ కార్యక్రమానికి హాజరు కాగా, ఈ షోలో విజయకు శ్రీమంతం వేడుక నిర్వహించారు. ఇక సుమ తన భార్య విజయకు శ్రీమంతం చేయడంతో ఒక్కసారిగా విజయ, వినోద ఇద్దరు ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.ఈ సందర్భంగా వినోద్ మాట్లాడుతూ రీసెంట్ గానే తనకు తన నాన్న చనిపోయారని అయితే నాన్న చనిపోయినప్పుడు తనకు తోడుగా ఎవరూ లేరని వినోద్ ఈ వేదికపై మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. ఈ సన్నివేశాలు తాజాగా విడుదలైన `క్యాష్` లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలోని సన్నివేశాలు. విడుదలైన ప్రోమో ప్రస్తుతం యూట్యూబ్‌లో వైరల్ అవుతుంది. లక్షల వ్యూస్‌తో దూసుకుపోతూ, అభిమానులను అలరిస్తుంది.
jabardasth comedian gets father promotion
ప్రోమోలో సుమ మాట్లాడుతూ.. నీకు కనుక మీ అమ్మ ఉంటే తప్పనిసరిగా ఇప్పుడు శ్రీమంతం చేసేది కదా ఇక మేమే మీ అమ్మ అనుకో అంటూ తనకు శ్రీమంతం చేసి తన బాధను మొత్తం పోగొట్టినట్లు తెలుస్తోంది.ఇలా తన భార్యకు తల్లి స్థానంలో సుమ శ్రీమంతం చేయడంతో వినోద్ కాళ్ళకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ షోలో జబర్ధస్త్ వినోద్ తో పాటు పవన్, తన్మయి, హరికృష్ణ కూడా పాల్గొన్నారు. హరికృష్ణ కూడా తన భార్యతో పాల్గొనగా, పవన్, ట్రాన్స్ జెండర్ తన్మయి తమ మదర్స్ తో షోలో పాల్గొన సందడి చేశారు. తమదైన కామెడీతో నవ్వించారు.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.