Singer Nagaraju : “అనిత ఓ అనిత” పాట పాడిన సింగర్ కష్టాలు వింటే బోరున ఏడవాల్సిందే వీడియో వైరల్..!!
Singer Nagaraju : 15 సంవత్సరాల క్రితం “అనిత ఓ అనిత” అనే సాంగ్ ఇంటర్నెట్ ని కుదిపేసింది. అప్పట్లో కాలేజీ కుర్రాళ్లంతా ఈ సాంగ్ కి బాగా ఆకర్షితులయ్యారు. ఆ టైంలో రాష్ట్ర విభజన జరగలేదు. దీంతో సాంగ్ ఎవరు పాడారు ఎందుకు పాడారు అన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక హాట్ టాపిక్ అయ్యింది. అయితే తర్వాత ఆ సాంగ్ పాడింది నాగరాజు అని మీడియా ద్వారా తెలిసింది. ప్రేమించిన అనిత అనే అమ్మాయి బ్రేకప్ చెప్పడంతో ఈ సాంగ్ రాసినట్లు చెప్పుకొచ్చారు.
ఇదంతా పక్కన పెడితే అనిత అనే సాంగ్ పాడిన నాగరాజు.. ఇటీవల ఓ ప్రముఖ వెబ్ మీడియా ఛానల్ యాంకర్ కి రోడ్డు మీద ఇంటర్వ్యూ ఇవ్వటం జరిగింది. అయితే ఇది అనుకోకుండా జరిగింది. విషయంలోకి వెళ్తే సదరు యాంకర్ కారు డ్రైవ్ చేస్తూ.. వెళ్తుండగా రోడ్డుమీద నాగరాజునీ చూసి గుర్తుపట్టి.. అతని కష్టసుఖాలు తెలుసుకోవడం జరిగింది. తనకి పెళ్లయిపోయిందని ఇద్దరు పిల్లలు ఉన్నారని లేక ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నట్లు
యాంకర్ దగ్గర నాగరాజు తన బాధలు చెప్పుకున్నాడు. ఇద్దరు పిల్లలు మూగ చెవిటి సమస్యతో బాధపడుతున్నారని ఇంకా అనేక కుటుంబ బాధలు చెప్పడంతో యాంకర్ వెంటనే స్పందించి కొంత అమౌంట్ చెక్ ద్వారా అందించారు. ఇదే సమయంలో ఇండస్ట్రీలో అవకాశాలు ఉంటే కల్పిస్తానని అదేవిధంగా ఇద్దరు పిల్లలకు వైద్యానికి సంబంధించి కూడా అన్ని ఎంక్వయిరీ చేసి పరిష్కరిస్తానని మాట ఇచ్చినారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.