Home » Entertainment » Anjali Comments On Ram Charan Game Changer Result
Entertainment

Anjali : గేమ్ ఛేంజర్ రిజల్ట్.. ఇది సరైన వేదిక కాదు మంచి సినిమా అన్నారు కానీ..!

Authored By
Rame Samhith
The Telugu News | Published on: January 28, 2025, 12:00 pm
Advertisement

Anjali : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా గేమ్ ఛేంజర్. దిల్ రాజు 450 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో కియరా అద్వాని హీరోయిన్ గా నటించగా థమన్ మ్యూజిక్ అందించాడు. సినిమాలో అంజలి కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ లో నటించాడు. సంక్రాంతికి రిలీజైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని రాబట్టలేదు.ఐతే ఈ సినిమా గురించి రీసెంట్ గా అంజలి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. గేమ్ ఛేంజర్ సినిమాలో తన పోర్షన్ వరకు బెస్ట్ ఇచ్చానని. ఐతే ఫలితం ఎలా ఉన్నా తన వరకు చాలా సంతృప్తి ఇచ్చిందని అన్నారు. అంతేకాదు గేమ్ ఛేంజర్ సినిమా చూసిన చాలామంది మంచి సినిమా అని అన్నారు తనకు ఎక్కడ నెగిటివ్ కామెంట్స్ రాలేదని అన్నారు అంజలి.

Advertisement

Anjali : గేమ్ ఛేంజర్ రిజల్ట్.. ఇది సరైన వేదిక కాదు మంచి సినిమా అన్నారు కానీ..!

Anjali : మరో వేదిక ఏర్పాటు చేసుకుందాం..

అంతేకాదు ఆ సినిమా గురించి మాట్లాడేందుకు ఇది సరైన వేదిక కాదు. ఆ సినిమా గురించి మాట్లాడేందుకు మరో వేదిక ఏర్పాటు చేసుకుందాం అప్పుడు ఒక గంట పాటు టైం తీసుకుందామని అన్నారు అంజలి. మొత్తానికి గేమ్ ఛేంజర్ సినిమా పై అంజలి తన ఫీలింగ్స్ షేర్ చేసుకున్నారు. సినిమా మంచి సినిమానే కానీ ఆడలేదని.. దాని గురించి మాట్లాడేందుకు చాలా అంశాలు ఉన్నాయని అన్నారు అంజలి.

Advertisement

విశాల్ హీరోగా సుద్నర్ సి డైరెక్షన్ లో తెరకెక్కిన మద గజ రాజా తెలుగులో రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ వచ్చిన అంజలి గేమ్ ఛేంజర్ సినిమా రిజల్ట్ పై కూడా స్పందించారు. సినిమాకు తామెంతో కష్టపడి పనిచేశామని చెప్పుకొచ్చారు.

సంక్రాంతికి రిలీజైన సినిమాల్లో గేమ్ ఛేంజర్ సినిమాకు వచ్చిన నెగిటివిటీ ఏ సినిమాకు రాలేదు. యాంటీ ఫ్యాన్స్ అంతా కూడా ఈ సినిమాపై నెగిటివ్ ట్రోల్స్ చేస్తూ విపరీతమైన నెగిటివ్టీ ఏర్పరిచారు. ఐతే శంకర్ సినిమా గురించి మాట్లాడటానికి నోచుకోని ఎంతోమంది గేమ్ ఛేంజర్ గురించి మాట్లాడటం విడ్డూరంగా అనిపించింది. Anjali, Ram Charan, Game Changer, Dil Raju, Vishal, Magagajaraja, Sunder C

Rame Samhith

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి