
Chandrababu Naidu : గుజరాత్ మోడల్ అంటున్న చంద్రబాబు.. ఏపీ జనాల ఆలోచన ఏంటి..!
Chandrababu Naidu : వైసీపీని YCP ఓడించి మళ్లీ అధికారంలోకి వచ్చారు చంద్రబాబు.: గత ఏడాది సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు, సూపర్ 6 గ్యారంటీలు, ఇతర సంక్షేమ పథకాలను ఇప్పట్లో అమలు చేయలేమంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటన పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఘాటుగా స్పందిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతోంది. అయితే చంద్రబాబు మాత్రం అవేమి పట్టించుకోకుండా తిరిగి అధికారంలోకి వచ్చేందుకు పావులు కదుపుతున్నారు. గుజరాత్ మోడల్ అంటున్నారు.బీజేపీ గుజరాత్ లో 1995 నుంచి వరసగా గెలుస్తోంది.
Chandrababu Naidu : గుజరాత్ మోడల్ అంటున్న చంద్రబాబు.. ఏపీ జనాల ఆలోచన ఏంటి..!
గుజరాత్ లో మొదట్లో కేశూభాయ్ పటేల్ అనే పెద్దాయన సీఎం గా చేశారు. ఆయన తరువాత అత్యధిక కాలం అంటే 13 ఏళ్ల పాటు నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రజలు అభివృద్ధి పట్ల ఆసక్తిని చూపిస్తే కనుక తప్పకుండా మార్పు వస్తుందని చంద్రబాబు అంటున్నారు. గుజరాత్ తో పాటు పశ్చిమ బెంగాల్, ఒడిశా, మధ్య ప్రదేశ్ ఇలా దేశంలో కొన్ని రాష్ట్రాలలో వరసగా అనేక పర్యాయాలు ఒకే పార్టీ ప్రభుత్వానికి ప్రజలు అవకాశం ఇచ్చారు.దాని వలన అక్కడ పాలన బాగుందని, ప్రజల సమస్యలు తీరాయని అంటున్నారు. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి చూస్తే ఏపీలో మాత్రం రాజకీయం ఎపుడూ మారుతూనే ఉంటుంది.
ప్రతీ అయిదేళ్ళకూ ఒక పార్టీని దించేసి మరో పార్టీని ఎక్కించడం ప్రజలు అలవాటుగా చేసుకున్నారు తెలుగుదేశం అధికారం చేపట్టాక రాజకీయం కాస్తా టీడీపీ వర్సెస్ కాంగ్రెస్ గా మారడం మనం చూశాం.. విభజన ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీగా మారింది. ఒకరిపై ఒకరు దారుణమైన ఆరోపణలు చేసుకున్నారు, నిందలు వేసుకున్నారు. ఈ సారి మాత్రం కుర్చీ టీడీపీకి దక్కింది. అయితే చంద్రబాబు చెప్పినట్లుగా ఏకపక్షంగా అనేక సార్లు టీడీపీనే గెలిపించాలన్నది ఏపీ ప్రజలు ఆలోచిస్తారా అన్నది చూడాలి. మరి టీడీపీ పొలిటికల్ ట్రాక్ రికార్డు చూస్తే 1999 తరువాత వరసగా రెండు సార్లు గెలిచి దాఖలాలు అయితే లేవు. మరి వచ్చే ఎలక్షన్స్ లో కూటమిగా అది జరుగుతుందా అనేది చూడాలి.
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.