Anjali : అంజ‌లికి ఐదు సార్లు పెళ్ల‌యిందా.. త‌న వివాహంపై ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేసిన క్యూట్ బ్యూటీ

Authored By aruna | The Telugu News | Published on: May 27, 2024, 6:30 pm
  •  Anjali : అంజ‌లికి ఐదు సార్లు పెళ్ల‌యిందా.. త‌న వివాహంపై ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేసిన క్యూట్ బ్యూటీ

Anjali : దక్షిణాది సినిమా పరిశ్రమలో సుదీర్ఘకాలంగా కెరీర్ కొనసాగిస్తున్న హీరోయిన్లలో అంజలి ఒక‌రు. తెలుగ‌మ్మాయి అయిన అంజ‌లి త‌న న‌ట‌న‌, అందంతో ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించింది. ఇటీవ గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమాతో ఆడియెన్స్ ఆకట్టుకొన్న ఈ భామ ప్రస్తుతం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రంతో మరోసారి ప్రేక్షక దేవుళ్లను ప్రసన్నం చేసుకొనేందుకు వ‌స్తుంది. అయితే ఈ క్ర‌మంలో ఆమె పెళ్లిళ్ల‌పై వ‌స్తున్న ప్రచారాల‌కి క్లారిటీ ఇచ్చింది. గత కొన్నాళ్లుగా అంజ‌లి పెళ్లికి సంబంధించి నెట్టింట అనేక వార్త‌లు చ‌క్క‌ర్లుకొట్టాయి. పెళ్లి కూడా చేసుకుందనే వార్తలొచ్చాయి.

Anjali పెళ్లిపై క్రేజీ ఆన్స‌ర్

ఆ మధ్య దీనిపై స్పందిస్తూ అంజలి కొట్టిపారేసింది. తాజాగా మరోసారి వివరణ ఇచ్చింది. తన మ్యారేజ్‌ రూమర్లు వస్తూనే ఉన్నాయని, ఇప్పటికే నాలుగైదు సార్లు మ్యారేజ్‌ చేశారని తెలిపారు. అయితే మొన్న వచ్చిన రూమర్లతో తమ బంధువులు కూడా ఫోన్‌ చేసి ఆరా తీసార‌ని, అంతగా రూమర్లు ప్రభావితం చేస్తున్నాయని తెలిపింది అంజలి. అలాగని తాను పెళ్లికి దూరం కాదు అని, కచ్చితంగా మ్యారేజ్‌ చేసుకుంటాను, కానీ ఇప్పుడు కాదని తెలిపింది అంజలి. ప్రస్తుతం తన ఫోకస్‌ అంతా సినిమాలపైనే ఉందని, మ్యారేజ్‌ చేసుకుంటే రెండింటిని మ్యానేజ్‌ చేయలేనని తెలిపింది.

Anjali : అంజ‌లికి ఐదు సార్లు పెళ్ల‌యిందా.. త‌న వివాహంపై ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేసిన క్యూట్ బ్యూటీ

Anjali : అంజ‌లికి ఐదు సార్లు పెళ్ల‌యిందా.. త‌న వివాహంపై ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేసిన క్యూట్ బ్యూటీ

ఇటు సినిమాని, అటు వ్యక్తిగత జీవితాన్ని రెండింటిని బ్యాలెన్స్ చేయగలిగినప్పుడే పెళ్లి చేసుకుంటానని చెప్పింది అంజలి. ప్రస్తుతం ఇదిగో ఇతన్ని చేసుకుంటానని ఇంట్లో చెప్పేంత టైమ్‌ కూడా ఉండటం లేదని, ఏదో ఒక సినిమాతో బిజీగా ఉంటున్నట్టు చెప్పింది అంజలి. గేమ్ ఛేంజర్‌లో కూడా నాది బలమైన పాత్ర. కీలకమైంది.. గెస్ట్ అప్పీయెరెన్స్ రోల్ కాదు. ఇద్దరు హీరోయిన్లు ఉంటే.. అందులో నాది కూడా ముఖ్యమైన పాత్రే. కథకు బలంగా ఉండే క్యారెక్టర్ నాది. గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ తర్వాత నా పాత్ర ఏమిటో మీకే అర్ధం అవుతుంది. దాని గురించి ఇప్పుడు చెప్పడం కుదరదు అంటూ ఆమె ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చింది.

aruna

No bio available for this author.

  1. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  2. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

  3. "Messi vs Ronaldo : మెస్సీయా.. రొనాల్డోనా? ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ ‘గోట్’ ఎవరో తేల్చేసిన ఆ లెక్కలు..!"

  4. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

  5. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

  6. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  7. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp