పవన్ కళ్యాణ్ మూడో భార్య షాకింగ్ లుక్.. ఆశ్చర్యంలో నెటిజన్స్
పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజినోవా ఈ మధ్య వార్తల్లో తెగ వైరల్ అయింది. నిహారిక పెళ్లికి వస్తుందని అందరూ భావించారు. కానీ ఆమె ఎక్కడా కనిపించలేదు. పవన్ కళ్యాణ్ మాత్రం అకీరా, ఆద్యలను పట్టుకుని నిహారిక పెళ్లికి వెళ్లాడు. దీంతో రకరకాల వార్తలు వైరల్ అయ్యాయి. మళ్లీ వ్యవహారం చెడి ఉంటుంది, అన్నా లెజినోవాకు విడాకులు ఇస్తున్నాడంటూ రూమర్లు బయటకు వచ్చాయి. అలా అన్నా లెజినోవా వార్తల్లో వైరల్ అయింది.

anna lezhneva latest pics goes viral
విడాకుల వార్తలపై జనసేన అధికార ప్రకటన ఇవ్వడం మరింత దుమారం రేపింది. మూడో భార్యకు విడాకులు ఇచ్చినట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదంటూ జనసేన ఓ ప్రెస్ నోట్ ఇచ్చినట్టు ఓ లేఖ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. క్రిస్మస్ వేడుకల్లో భాగంగానే ఆమె రష్యాకు వెళ్లింది అందుకే.. నిహారిక పెళ్లికి హాజరు కాలేదని అందులో చెప్పుకొచ్చారు. అలా అన్నా లెజినోవా గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అయింది.
అయితే తాజాగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కనిపించి అందరికి షాక్ ఇచ్చింది. ప్రతి ఏడాది క్రిస్మస్ టైంలో అన్నా లెజినోవా..తమ సొంత దేశానికి వెళ్లి వేడుకల్లో పాల్గొంటుంది. ఈ ఏడాది కూడా అలాగే వెళ్ళింది. అయితే ఇప్పుడు సడెన్‌గా ఏమైందో కానీ ఆమె క్రిస్మస్ వేడుకలు పూర్తి కాకముందే హైదరాబాద్‌కు తిరిగివచ్చింది. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్‌లో అన్నా లెజినోవాని చూసి అంతా షాకవుతున్నారు. ఆమె రూపం పూర్తిగా మారిపోయింది. లావుగా అవ్వడంతో అందరూ గుర్తు పట్టలేకపోతున్నారు.