Pooja Hegde : పూజా హెగ్డేకి ఎక్కడ కలిసి రావట్లేదు కానీ కోలీవుడ్ లో మాత్రం డబుల్ ఛాన్సులు.. ఎందుకు..?
ప్రధానాంశాలు:
Pooja Hegde : పూజా హెగ్డేకి ఎక్కడ కలిసి రావట్లేదు కానీ కోలీవుడ్ లో మాత్రం డబుల్ ఛాన్సులు.. ఎందుకు..?
Pooja Hegde : బుట్ట బొమ్మ పూజా హెగ్దే Pooja Hegde టాలీవుడ్ Tollywood లో అసలు ఛాన్సులు రావట్లేదని బాధపడుతుంది. Bollywood బాలీవుడ్ లో ఒకటి అర అవకాశాలు వస్తున్నా అవి అన్నీ ఫ్లాపులు అవుతున్నాయి. రీసెంట్ గా షాహిద్ కపూర్ shahid kapoor తో దేవా సినిమా Deva Movie చేయగా అది కూడా సక్సెస్ అందుకోలేదు. అందుకే పూజాని అక్కడ లైట్ తీసుకుంటున్నారు. ఇక టాలీవుడ్ లో ఎప్పుడైతే గుంటూరు కారం సినిమా నుంచి తప్పుకుందో అప్పటి నుంచి ఆమెను ఎవరు తీసుకోవట్లేదు. ఐతే కోలీవుడ్ లో మాత్రం సీన్ రివర్స్ లో ఉంది. పూజా హెగ్దేకి అక్కడ వరుస ఛాన్స్ లు వస్తున్నాయి. ఇప్పటికే సూర్య రెట్రో సినిమాలో నటిస్తుంది అమ్మడు. కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా విషయంలో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా తర్వాత దళపతి విజయ్ జన నాయగన్ లో కూడా ఆమె నటిస్తుంది. ఈ రెండు సినిమాలు భారీ క్రేజ్ తో వస్తున్నాయి.

Pooja Hegde : పూజా హెగ్డేకి ఎక్కడ కలిసి రావట్లేదు కానీ కోలీవుడ్ లో మాత్రం డబుల్ ఛాన్సులు.. ఎందుకు..?
Pooja Hegde : రజినీకాంత్ జైలర్ 2 లో కూడా
ఇక ఈ సినిమాల తర్వాత లేటెస్ట్ గా సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ 2 లో కూడా స్పెషల్ అప్పియరెన్స్ ఇస్తుందట పూజా హెగ్దే. జైలర్ 1 లో తమన్నా కావాలయ్య సాంగ్ చేసింది. ఇక ఇప్పుడు సీక్వెల్ లో బుట్ట బొమ్మ చేత చేయిస్తున్నారు. పూజా హెగ్దే మార్క్ గ్లామర్ షో ఉంటుందని తెలుస్తుంది. తెలుగు, హిందీల్లో అమ్మడికి బ్యాడ్ లక్ వెంటాడుతుంటే తమిళ్ లో మాత్రం పూజా హెగ్దేకి వరుస అవకాశాలు వస్తున్నాయి.
పూజా బేబీ ఈ ఛాన్స్ లను ఎలా తన కెరీర్ కు ఉపయోగపడేలా చేస్తుందో చూడాలి. పూజా హెగ్దే తెలుగులో ఛాన్స్ లు రావట్లేదు అన్న కోపం తో రీసెంట్ ఇంటర్వ్యూలో అల వైకుంఠపురములో సినిమా తమిళ సూపర్ హిట్ సినిమా అని చెప్పింది. మరి అమ్మడికి తెలుగు ఆఫర్ ఎందుకు రావట్లేదు అన్నది తెలియదు కానీ పూజా ఫ్యాన్స్ మాత్రం ఆమెను మిస్ అవుతున్నారు. Pooja Hegde, Rajanikanth, Jailer 2, Kollywood