Balakrishna : ర‌జ‌నీకాంత్ కోసం బాల‌య్య న‌డిచొస్తే ఎలా ఉంటది.. ద‌బిడి దిబిడే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Balakrishna : ర‌జ‌నీకాంత్ కోసం బాల‌య్య న‌డిచొస్తే ఎలా ఉంటది.. ద‌బిడి దిబిడే..!

 Authored By ramu | The Telugu News | Updated on :30 April 2025,5:00 pm

ప్రధానాంశాలు:

  •  Balakrishna : ర‌జ‌నీకాంత్ కోసం బాల‌య్య న‌డిచొస్తే ఎలా ఉంటది.. ద‌బిడి దిబిడే..!

Balakrishna : నందమూరి నట సింహం బాలకృష్ణ Balakrishna, rajinikanth సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ఇద్దరూ jailer 2 కలిసి స్క్రీన్ మీద కనిపిస్తే ఎలా ఉంటుంది? ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలోని థియేటర్లలో రెస్పాన్స్ ఏ రేంజ్‌లో ఉంటుంది , థియేట‌ర్స్ ద‌ద్ద‌రిల్లిపోవ‌ల్సిందే. రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన సినిమా ‘జైలర్’.‌ బాక్స్ ఆఫీస్ బరిలో 600 కోట్ల రూపాయలకు పైగా కలెక్ట్ చేసింది. రజని స్టామినా ఏమిటనేది ఈతరం ప్రేక్షకులకు చూపించిన చిత్రమిది.

Balakrishna ర‌జ‌నీకాంత్ కోసం బాల‌య్య న‌డిచొస్తే ఎలా ఉంటది ద‌బిడి దిబిడే

Balakrishna : ర‌జ‌నీకాంత్ కోసం బాల‌య్య న‌డిచొస్తే ఎలా ఉంటది.. ద‌బిడి దిబిడే..!

Balakrishna అదిరిపోద్దంతే..

‘జైలర్’ సినిమాలో మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్, కరుణాడ చక్రవర్తి శివ రాజ్ కుమార్, బాలీవుడ్ నటుడు జాకీ‌ ష్రాఫ్ అతిథి పాత్రలలో సందడి చేశారు. అప్పట్లో బాలకృష్ణ కూడా ఆ సినిమాలో నటించాల్సిందని దర్శకుడు నెల్సన్ తెలిపారు. బాలయ్య కోసం ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ చేయాలని అనుకున్నామని, అయితే అది కుదరలేదని ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.

అయితే ‘జైలర్ 2’ సినిమాలో బాలకృష్ణ అతిధి పాత్రలో నటించనున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. త్వరలో ఆయన చిత్రీకరణలో పాల్గొంటారు. ఆయన రోల్ ఎలా ఉంటుంది? స్క్రీన్ మీద ఎంత సేపు కనిపిస్తారు? వంటి ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. ‘జైలర్’లో అతిథి పాత్రల్లో సందడి చేసిన మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ మరోసారి ‘జైలర్ 2’లోనూ సందడి చేయనున్నారు. వాళ్లిద్దరూ కాకుండా బాలకృష్ణ జాయిన్ అయ్యారు. మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్, కోలీవుడ్ స్టార్ ఎస్.జె. సూర్య ఇందులో నటిస్తున్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది