Akkineni Nageswara Rao : ఆ స్టార్ హీరోయిన్‌ను చూసి ఏఎన్నార్ ఎందుకో భయపడేవారంట.. కారణమిదేనా?

Authored By mallesh | The Telugu News | Published on: August 23, 2022, 8:00 pm

Akkineni Nageswara Rao : అక్కినేని నాగేశ్వరరావు.. ఈయన ఎన్టీఆర్ గారు తెలుగు ఇండస్ట్రీకి రెండు కళ్లు అని చాలా మంది సీనియర్ సినీ పెద్దలు అంటున్నారు. ఇండస్ట్రీ చాలా కాలం ఒక్కటిగా ఉండటానికి, అభివృద్ధి చెండటానికి వీరిద్దరి కృషి ఎంతగానో ఉందని దర్శకనిర్మాతలు, సీనియర్ నటీనటులు పలుమార్లు చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్-ఏఎన్నార్ సినిమాల్లో పోటీ పడి నటించడమే కాకుండా వీరి కుటుంబాల మధ్య స్నేహపూరిత బంధం ఉండేది.

Akkineni Nageswara Rao : మురళిమోహన్ ఏమన్నారంటే..

ఏఎన్నార్ ఇండస్ట్రీలోని చాలా మంది హీరోయిన్స్‌తో పనిచేశారు. సావిత్రి లాంటి మహానటితో సైతం ఏఎన్నార్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు.అయితే, ఏఎన్ఆర్‌కు హీరోయిన్ల ముద్దుల హీరో అనే పేరు ఉండేదని టాక్ వినిపిస్తోంది. హీరోయిన్ల విషయంలో ఏఎన్ఆర్ ఎంతో ప్రేమతో ఉండేవారట. సెట్స్ లో సరదాగా చిలిపి పనులు చేస్తూ వారిని ఆట పట్టిస్తూ ఉండడంతో పాటు వారిపై చమక్కులు కూడా వేసే వారట. అందుకే హీరోయిన్లు ఎన్టీఆర్ కంటే ఏఎన్ఆర్ ను ఎక్కువగా ఇష్టపడతారని అప్పట్లో టాక్ ఉండేది. ఎన్టీఆర్ సెట్ లో చాలా గంభీరంగా ఉండడంతో పాటు షూటింగ్ విషయంలో సీరియస్‌గా ఉండేవారట. ఎన్టీఆర్ సెట్స్ లో ఉంటే అక్కడ అంతా గంభీరమైన వాతావరణం నెలకొనేదట. అదే ఏఎన్ఆర్ సెట్లో ఉంటే అక్కడంతా సందడి సందడిగా ఉండేదట.

Akkineni Nageswara Rao Afraid Of Jayasudha In Movie Shootings

Akkineni Nageswara Rao Afraid Of Jayasudha In Movie Shootings

ఏఎన్ఆర్ కూడా తన కెరీర్లో ఎంతోమంది స్టార్ హీరోయిన్లతో నటించారు జయసుధ – జయప్రద – వాణిశ్రీ – జ‌య‌చిత్ర – సావిత్రి – శ్రీవిద్య ఇలా అప్పటితరం టాప్ హీరోయిన్లు అందరతో కలిసి నటించారు. స‌హ‌జ‌న‌టి జ‌జయసుధ య‌సుధ సెట్లో ఉంటే త‌న‌కు ఎందుకో భ‌యం ఉంటుంది అని ఏఎన్నార్ అనేవార‌ట‌.ఈ విష‌యాన్ని సీనియ‌ర్ న‌టుడు ముర‌ళీమోహ‌న్ వెల్లడించారు. జ‌య‌సుధ గొప్ప న‌ట‌న గురించి ఏఎన్నార్ చెప్పిన మాట‌ల‌ను ముర‌ళీమోహ‌న్ గుర్తుచేశారు.జ‌య‌సుధపై సింగిల్ షాట్స్ తీస్తున్న‌ప్పుడు ఆమె ఎక్స్‌ప్రెష‌న్స్ ఎలా ఇస్తుందో మ‌నం గ‌మ‌నించకపోతే త‌ర్వాత ఇద్ద‌రిపై తీసే కామ‌న్ షాట్స్‌లో మ‌నం ఆమెను మించేలా ఎలా ఉండాలో తెలియ‌క దెబ్బైపోతాం అని ఏఎన్నార్ మురళిమోహన్‌తో చెప్పారట..

mallesh

No bio available for this author.

  1. "Yanamala Krishnudu : టీడీపీ ఎమ్మెల్యే ఉన్న చోట జనసేనలోకి మాజీ ప్రత్యర్థులు.. కాకినాడ రాజకీయాల్లో కొత్త లెక్కలు"

  2. "Vangaveeti Ranga Statue : వంగవీటి రంగా విగ్రహం చుట్టూ ముదురుతున్న రచ్చ.. జనసేన-వైసీపీ మధ్య మైండ్‌గేమ్స్..!"

  3. "Dada Movie : బాలయ్య ‘దాదా’ టీమ్‌కు డెడ్‌లైన్ టెన్షన్.. డిసెంబర్ రిలీజ్ కష్టమేనా..?"

  4. "Khairatabad Bypoll : ఖైరతాబాద్ బైపోల్ వేళ కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్.. జీహెచ్ఎంసీపై జెండా పాతేందుకు భారీ వ్యూహం..!"

  5. "The Paradise Movie : నాని ‘ది ప్యారడైజ్’ అనౌన్స్‌మెంట్‌తో ఫ్యాన్స్ ఫిదా.. బాక్సాఫీస్ వద్ద మరో సంచలనం ఖాయమా?"

  6. "TN Seshan : ఆ ఒక్కడి దెబ్బతో నేతల వెన్నులో వణుకు.. భారత ఎన్నికల చరిత్రను మార్చేసిన టీఎన్ శేషన్ లెగసీ"

  7. "PM Kisan Annadata Sukhibhava : రైతులకు అదిరిపోయే దసరా కానుక.. ఒకేసారి ఖాతాల్లో రూ.6,000 జమ..?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp