Kadambari Kiran : ANR చనిపోయే ముందు రోజు హాస్పిటల్ లో ఏం జరిగిందంటే…!!
Kadambari Kiran : తెలుగు సినీ ఇండస్ట్రీలో ఏఎన్ఆర్ ఎన్టీఆర్ కి ఎంతటి క్రేజ్ ఉందో మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పటి తెలుగు సినీ ఇండస్ట్రీని దశదిశల వ్యాపించేలా చేసింది వీరిద్దరే అని చెప్పాలి. కానీ ఇప్పుడు వీరిద్దరూ మన మధ్య లేరు.అయినప్పటికీ ఏదో రకంగా ఎప్పుడో ఒక సందర్భంలో వీరిని మనం తలుచుకుంటూనే ఉంటాం. అయితే తాజాగా సినీ నటుడు కదంబరి కిరణ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఏఎన్ఆర్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏఎన్ఆర్ గారు హాస్పిటల్ లో ఉన్న సందర్భంలో తాను వెళ్లినట్లుగా తెలియజేశారు. ఇక ఆయనను చూడడానికి వెళ్ళిన సందర్భంలో ఏఎన్ఆర్ గారు పడుకుని ఉన్నారని, ఇక ఆ సందర్భంలో హరిచంద్ర ప్రసాద్ గారు అటుగా వెళుతుంటే ఆయనను చూడకుండా ఇటుగా ఆగిన నన్ను మాత్రమే చూశారని తెలియజేశారు.
ఇక నేను ఆయనను చూసిన సందర్భంలో ఆయన కళ్ళు మొత్తం వాచిపోయి ఉన్నాయని ముఖం కూడా ఉబ్బి ఉందని కిరణ్ తెలియజేశారు. అలా ప్రతిరోజు హాస్పిటల్ దగ్గరికి వెళ్లి ఏఎన్ఆర్ గారిని కలిసి మాట్లాడేవాడినని తెలిపారు. నాది ఏఎన్ఆర్ గారితో చాలా ఎమోషనల్ జర్నీ అని తెలియజేశారు.ఏఎన్ఆర్ గారు నాకు చాలా మర్యాద ఇచ్చి మాట్లాడే వారని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఇక ఆయన వ్యక్తిత్వం ఆయన ఒక నిర్మాతని చూసే విధానం చాలా గొప్పగా ఉంటుంది. ఇక ఆయన నా మీద చూపించిన వాత్సల్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదని తేలియజేసారు. ఇక నిర్మాతలను బాగా అర్థం చేసుకునే వారిలో ఏఎన్ఆర్ ముందు ఉంటారని ఆయన చెప్పారు. ఎందుకంటే నిర్మాత ఎంత కష్టపడి హీరోని తీసుకొస్తున్నారు తీసుకెళ్తున్నారు ఎలా చూసుకుంటున్నారు అనే ప్రతి కష్టాన్ని ఆయన పరిగణిస్తారని చెప్పుకొచ్చారు. ఇదంతా నేను నా అనుభవం ప్రకారం మాత్రమే చెబుతున్నాను అండి. ఏఎన్ఆర్ గారితో నాకున్న అనుభవం గురించి చెబుతున్నాను అంటూ ఆయన తెలియజేశారు. ఆయన వ్యక్తిగతంగా ఏం చెబుతారో వేదిక పైన కూడా అదే చెబుతారు. ఎలాంటి మాట మార్చారు అంటూ చెప్పుకొచ్చారు.
ఇక మా ఇద్దరి మధ్య స్నేహం వాత్సల్యం చాలా బలంగా ఉండేది అంటూ చెప్పుకొచ్చారు. ఆయన లాస్ట్ సినిమా ఒప్పుకున్నప్పుడు, ఆ సినిమాకి ఫస్ట్ మేకప్ వేసుకున్నప్పుడు, ఆ సినిమాకి గెటప్ వేసుకున్నప్పుడు , ఆ సినిమా షూట్ చేసినప్పుడు ఆ సినిమా జరుగుతున్నప్పుడు తనకు అనారోగ్యం చేసే కడుపునొప్పి వచ్చినప్పుడు, కడుపునొప్పి వచ్చి ఆస్పత్రికి వెళితే అది క్యాన్సర్ అని తెలిసినప్పుడు, అది క్యాన్సర్ అని ప్రపంచానికి చెబుతానని చెప్పిన్నపుడు ప్రతి విషయానికి ఏఎన్ఆర్ గారు నాకు కాల్ చేసి చెప్పేవారు. క్యాన్సర్ ఆపరేషన్ అయిపోయి ఇంటికి వచ్చినప్పుడు కూడా ఏఎన్ఆర్ గారు నాకు కాల్ చేసి మాట్లాడారు.ఆ విధంగా మా ఇద్దరి మధ్య బంధం వాత్సల్యం ఉండేది అంటూ ఈ సందర్భంగా కదంబరి కిరణ్ ఇంటర్ లో తెలియజేశారు.