Anshu Reddy : అన్షు రెడ్డి డ్యాన్స్‌కి ఫిదా కాని వారు లేరు.. ఈ అమ్మ‌డి అందం ముందు హీరోయిన్స్ పనికి రారు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Anshu Reddy : అన్షు రెడ్డి డ్యాన్స్‌కి ఫిదా కాని వారు లేరు.. ఈ అమ్మ‌డి అందం ముందు హీరోయిన్స్ పనికి రారు..!

 Authored By ramu | The Telugu News | Updated on :17 July 2025,4:00 pm

ప్రధానాంశాలు:

  •  Anshu Reddy : అన్షు రెడ్డి డ్యాన్స్‌కి ఫిదా కాని వారు లేరు.. ఈ అమ్మ‌డి అందం ముందు హీరోయిన్స్ పనికి రారు..!

Anshu Reddy : ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్‌ illu illalu pillalu serial లో నర్మద Narmada పాత్రలో ఆడియన్స్‌ని ఫిదా చేసిన ముద్దుగుమ్మ‌ అన్షురెడ్డి. గడుసు కోడలిగా ఈ సీరియల్‌లో తన అందం, అభినయంతో ఆకట్టుకుంటున్న అన్షు తెలుగు పిల్ల అన్న సంగతి తెలిసిందే. తెలంగాణ సూర్యపేటలో పుట్టిన అన్షు ఇప్పటివరుకు పలు సీరియల్స్‌లో నటించింది.

Anshu Reddy అన్షు రెడ్డి డ్యాన్స్‌కి ఫిదా కాని వారు లేరు ఈ అమ్మ‌డి అందం ముందు హీరోయిన్స్ పనికి రారు

Anshu Reddy : అన్షు రెడ్డి డ్యాన్స్‌కి ఫిదా కాని వారు లేరు.. ఈ అమ్మ‌డి అందం ముందు హీరోయిన్స్ పనికి రారు..!

Anshu Reddy : కైపెక్కించే అందం..

భార్యమణి సీరియల్‌లో బుల్లితెరకి పరిచయమైన అన్షురెడ్డి.. ఇద్దరమ్మాయిలు, అష్టాచెమ్మా, నా పేరు మీనాక్షి, సూర్యవంశం సహా ఎన్నో సీరియల్స్‌లో నటిించింది. ఇప్పుడు ఇల్లు ఇల్లాలు పిల్లలు ధారావాహికలో తన పెర్ఫామెన్స్‌తో ఆకట్టుకుంటుంది. ఇటీవ‌ల ఢీ డ్యాన్స్ షోలో కూడా సంద‌డి చేసింది. మిల్కీ బ్యూటీ తమన్నా ఆడిపాడిన ‘ఆజ్‌కీ రాత్ మజా’ అనే హిందీ సాంగ్‌కి అన్షురెడ్డి అదిరిపోయే పెర్పామెన్స్ ఇచ్చింది.

నడుము ఊపుతూ ఒంపు సొంపులతో అందరినీ ఫిదా చేసింది. ఈ పెర్ఫామెన్స్ చూసి అన్షు చాలా చిలిపిగా చేశావ్ అంటూ రెజీనా మెచ్చుకున్నారు. మాములుగా లేదు సో హాట్ అంటూ రెజీనా అన్న మాటకి అన్షు తెగ సిగ్గుపడిపోయింది. ఇప్పటివరకూ సీరియల్స్‌లో తన నటన, అందంతో కట్టిపడేసిన అన్షు డ్యాన్స్‌ల‌తో అద‌ర‌గొడుతుంది. ఇక సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ భామ త‌న క్యూట్ పిక్స్ కూడా షేర్ చేస్తూ ర‌చ్చ చేస్తుంది. ప్ర‌స్తుతం అన్షు రెడ్డి ఫొటోలు, వీడియోలు వైర‌ల్ అవుతున్నాయి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది