Anshu Reddy : అన్షు రెడ్డి జీవితంలో ఇన్ని కష్టాలా.. రూ.3 కోసం ఆరు మైళ్లు నడిచిందా?
ప్రధానాంశాలు:
Anshu Reddy : అన్షు రెడ్డి జీవితంలో ఇన్ని కష్టాలా.. రూ.3 కోసం ఆరు మైళ్లు నడిచిందా?
Anshu Reddy : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌లో Illu Illalu Pillalu Serial Narmada నర్మద పాత్రతో అలరిస్తున్న అన్షురెడ్డి తన జీవిత ప్రయాణం గురించి ఓ ఇంటర్వ్యూలో భావోద్వేగంగా చెప్పుకొచ్చింది. సీరియల్ ద్వారా తాను సాధించిన గుర్తింపు, గతంలో ఎదుర్కొన్న కష్టాలు, ఇండస్ట్రీకి వచ్చిన పరిస్థితులు వంటి విషయాలను ఆమె వ్యక్తపరిచింది. అన్షురెడ్డి అసలు పేరు అనూష. ఇంట్లో నన్ను ‘అన్షు’ అని పిలిచేవారు. అదే పేరుతో ఇండస్ట్రీలోకి వచ్చాను. తరువాత ‘రెడ్డి’ను జత చేసి ‘అన్షురెడ్డి’ అయ్యాను” అంటుంది.

Anshu Reddy : అన్షు రెడ్డి జీవితంలో ఇన్ని కష్టాలా.. రూ.3 కోసం ఆరు మైళ్లు నడిచిందా?
Anshu Reddy అన్ని కష్టాల నడుమ..
స్టార్ మహిళ గేమ్ షో ద్వారా తొలిసారి కెమెరా ముందుకి వచ్చారు.మొదటగా శ్రావణ సమీరాలు అనే సీరియల్‌లో నటించే అవకాశం వచ్చింది.అన్నయ్య మొదట ఒప్పుకోకపోయినా, చివరకు సహకరించారు. అన్షురెడ్డి తన చిన్ననాటి ఆర్థిక ఇబ్బందుల్ని గుర్తు చేసుకుంటూ .. హైదరాబాద్ వచ్చాక, డబ్బు కోసం ఒక చాక్లెట్ ఫ్యాక్టరీలో డైలీ వేజ్ వర్కర్‌గా పనిచేశారు.రోజుకు రూ.70 వేతనం.. 12 గంటల పని. రూ.3 బస్ టికెట్ కాగా, అది దాచుకోవాలంటే 6 కిలోమీటర్లు నడిచేదాన్ని.
తల్లి, అక్కలతో కలిసి సంపాదించిన డబ్బుతో అన్నయ్య బీటెక్ చదువు పూర్తి చేశారు.తరువాత అక్క చదువు.. చివరికి తానే కాలేజీలో చేరింది. తర్వాత డిప్లమో చేసి నటనలోకి వచ్చారు. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎక్కడికెళ్లినా తల్లితో పాటు వెళ్లేదానిని. ఆమె లేకపోతే షూటింగ్‌కి కూడా వెళ్లే దానిని కాదు. తన వర్క్ ప్లేస్‌లో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటానని, బ్యాడ్ ఎక్స్‌పీరియెన్స్ ఏదీ ఎదురుకాలేదని చెప్పారు.నేను నటనలోకి వస్తానని అసలు అనుకోలేదు. అనుకోకుండా వచ్చాను.వణుకుతూ ఆడిషన్స్‌కి వెళ్లినాను. కానీ దురదృష్టమే నా అదృష్టమయ్యింది. ఇప్పుడు మీ ముందు ఇలా నిలవగలగుతున్నాను” అని అన్షురెడ్డి ఎమోషనల్‌గా చెప్పుకొచ్చారు.