Anu Emmanuel : అను ఎమ్యాన్యుయేల్‌ని త్రివిక్ర‌మ్ అంత‌లా మోసం చేశాడా..!

Authored By Sam C | The Telugu News | Published on: September 8, 2022, 5:30 pm

Anu Emmanuel : చూడ చ‌క్క‌ని అందం, ఆక‌ట్టుకునే అభిన‌యం ఉన్నా కూడా అదృష్టం లేక దారుణ‌మైన ప‌రిస్థితిని చ‌వి చూస్తుంది అందాల ముద్దుగుమ్మ అను ఎమ్యాన్యుయేల్. మజ్ను’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఎన్నారై బ్యూటీ . తొలి సినిమాతో హిట్ అందుకున్న ఈ బ్యూటీకి మంచి ఆఫ‌ర్సే వ‌చ్చాయి. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లాంటి హీరోలతో ఛాన్స్ లు రావడంతో అమ్మడు స్టార్ హీరోయిన్ అయిపోతుందని అనుకున్నారంతా. కాని అదృష్టం బాగో లేక అను ప‌రిస్థితి దారుణంగా మారింది. అవ‌కాశాలు త‌లుపు త‌ట్ట‌డం మానేశాయి. ‘అజ్ఞాతవాసి’, ‘నా పేరు సూర్య’ రెండూ కూడా ఫ్లాప్ అవ్వడంతో అను ఎమ్మాన్యుయేల్ కి తెలుగులో అవకాశాలు తగ్గాయి.

Anu Emmanuel : పాపం అను..

నాగచైతన్యతో చేసిన ‘శైలజా రెడ్డి అల్లుడు’ సినిమా కూడా ఏవరేజ్ గా ఆడింది. ఆ త‌ర్వాత చేసిన ప‌లు చిత్రాలు కూడా అనుకి పెద్ద‌గా గుర్తింపు తెచ్చిపెట్ట‌లేక‌పోయాయి. అనూ ఇమ్మానియేల్‌కి అజ్ఞాత వాసి సినిమాలో హీరోయిన్‌గా అవకాశం రాగానే ఉబ్బి తబ్బిబ్బై తన స్టార్ డం ఏ సమంతనో, పూజా హెగ్డే రేంజ్‌లోనో ఊహించుకుంది. కానీ, త్రివిక్ర‌మ్ రొటీన్ ఫార్ములాతో పవన్ తో పాటు ఆయన అభిమానులకు షాకిచ్చాడు. దాంతో ఎన్నో ఆశలు పెట్టుకొని భారీ హిట్ దక్కించుకొని వెలిగిపోవాలనుకున్న అనూ ఇమ్మానియేల్ అడ్రస్ లేకుండా పోయింది. పెద్ద హీరోల‌తో న‌టించినా కూడా ఇప్ప‌టికీ ఈ అమ్మ‌డు ఒక్క ఆఫ‌ర్ కూడా అంది పుచ్చుకోలేక‌పోతుంది.

anu emmanuel cheated by trivikram

anu emmanuel cheated by trivikram

అను ఎమ్మాన్యుయేల్ కెరీర్ సజావుగా సాగ‌డం లేదు. ఈ క్రమంలో ఆమె ప్ర‌ముఖ నిర్మాత ఏఎమ్ ర‌త్నం త‌న‌యుడు జ్యోతికృష్ణని వివాహం చేసుకోవాల‌ని భావిస్తున్న‌ట్టు ఆ మ‌ధ్య వార్త‌లు వ‌చ్చాయి. 2017లో గోపిచంద్ హీరోగా జ్యోతికృష్ణ ఆక్సీజ‌న్ అనే సినిమా తెర‌కెక్కించాడు. ఇందులో అను ఎమ్యాన్యుయేల్ క‌థానాయికగా న‌టించింది. ఈ సినిమా షూటింగ్‌లో అను, జ్యోతికృష్ణ‌ల మ‌ధ్య మొద‌లైన స్నేహం ప్రేమ‌గా మారి పెళ్లి వ‌ర‌కు వెళ్ళేలా కనిపిస్తుందని వార్త‌లు రాశారు. ప్ర‌స్తుతం డేటింగ్‌లో ఉన్న‌ట్టు తెలుస్తుండ‌గా, త్వ‌ర‌లో పెళ్లి పీట‌లు ఎక్క‌నున్నార‌ని తెలుస్తుంది. మ‌రి ఇందులో ఎంత నిజం ఉంద‌నేది తెలియాల్సి ఉంది.

Sam C

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp