Anupama Parameswaran : గ్లామర్ షోపై అనుపమ కామెంట్.. రోజు అన్నమే తినలేం కదా అంటూ పంచ్..!
Anupama Parameswaran : కేరళ భామ అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ తక్కువ సమయంలో మంచి క్రేజ్ దక్కించుకుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అఆ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించి మెప్పించిన ఈ చిన్నది తర్వాత యంగ్ హీరోల సరసన నటించి మంచి పేరు తెచ్చుకుంది. అయితే కెరీర్ మొదట్లో కాస్త పద్దతిగా కనిపించిన ఈ క్యూట్ లేడి ఇటీవల మాత్రం రెచ్చిపోయి అందాల ఆరబోతకి దిగుతుంది. రౌడీ బాయ్స్ సినిమాలో లిప్ లాక్ తో కుర్రకారుకి షాక్ ఇచ్చింది. అసలు ఏంటి అనుపమ ఇంతలా రెచ్చిపోయిందని ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు. ప్రస్తుతం ఈ భామ సిద్దూ జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న టిల్లు స్క్వేర్ సినిమాలో కథానాయికగా నటిస్తుంది.
ఇటీవల ఈ మూవీ టీజర్ విడదల కాగా, ఇందులో ముద్దులతో రెచ్చిపోయింది. అనుపమ ఈ రేంజ్‌లో రెచ్చిపోవడం చూసి అందరు షాక్ అవుతున్నారు. నార్మల్ పాత్రలు చేసి, అసలు బోల్డ్ క్యారెక్టర్, కిస్ సీన్స్ లేకుండా చేసిన అనుపమ ఇప్పుడు ఇంతలా ఎందుకు రెచ్చిపోతుంది అనే దానిపై క్లారిటీ రావడం లేదు. దీనిపై క్లారిటీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. టిల్లు స్క్వేర్ సినిమా నుంచి ఓ బ్రేకప్ సాంగ్ రిలీజ్ అవ్వగా ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్‌కి అనుపమ హాజరైంది. ఈ ఈవెంట్‌లో తాను మీడియా వారు అడిగిన అనేక ప్రశ్నలకి ఆసక్తికర సమాధానాలు ఇచ్చింది. మీకు బిర్యానీ అంటే ఇష్టమా..? కానీ ప్రతి రోజు బిర్యానీ తినలేము కదా..? బోర్ వచ్చేస్తుంది.
నాకు కూడా రొటీన్ పాత్రలు చేస్తూ బోర్ వచ్చేసింది. అందుకే ఈ సారి అలా ట్రై చేశా అని తెలిపింది. అఆ సినిమా చేసినప్పుడు నా వయసు 19 ఏళ్లు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 9 ఏళ్లు అవుతుంది కాబట్టి అప్పుడు చేసిన పాత్రలు ఇప్పుడు మళ్లీ చేయాలని అనిపించడం లేదు.నేను కూడా మనిషినే కాబట్టి నాకు కమ్‌ఫర్టబుల్‌గా ఉండే పాత్రలు చేస్తున్నాను అని భావించాను. యాక్టర్‌గా నాకు కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. బాధ్యత ప్రకారం నేను నడుచుకుంటూను అని పేర్కొంది. టిల్లు స్క్వేర్ సినిమా ప్రమోషన్స్‌కి అనుపమ రావడం లేదు అనే విమర్శలు ఉండగా దానికి సమాధానం ఇవ్వగా తాను వేరే సినిమా షూటింగ్‌తో బిజీగా ఉండడం వలన కుదరలేదని తెలియజేసింది.
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…
Morning Tiffin | రాత్రంతా నిద్రపోయిన తర్వాత శరీరం ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో శక్తి అవసరం అవుతుంది. అందుకే ఉదయం…
Health Tips | బొప్పాయి మంచి పోషకాలతో నిండి ఉండే పండు. ఇందులో విటమిన్లు ఎ, సి, ఇ ఎక్కువగా…
Banana peel Face Pack | మెరిసే చర్మం ఎవరికైనా ఇష్టమే! అందుకే మార్కెట్‌లో లభించే విభిన్నమైన బ్యూటీ క్రీములకు ఎంతో…
September | సెప్టెంబర్‌లో శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో, కొన్ని రాశుల వారికి అదృష్టదాయక సమయం ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా…
Flipkart Jobs: పండుగ సీజన్ దగ్గరపడుతుండటంతో ఈ-కామర్స్ రంగంలో జోరు పెరిగింది. ముఖ్యంగా ఫ్లిప్‌కార్ట్ తన బిగ్ బిలియన్ డేస్…
This website uses cookies.