
Anupama Parameswaran : అనుపమ పరమేశ్వరన్ కు లవ్ బ్రేకప్.. అతడితో లిప్ లాక్ సీన్లే కారణమా..?
Anupama Parameswaran : మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులలో మంచి స్థానాన్ని సంపాదించుకున్నారు. ముఖ్యంగా యూత్ లో అనుపమకు అదిరిపోయే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మలయాళం లో ‘ ప్రేమమ్ ‘ మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన అనుపమ తెలుగులో సమంత, నితిన్ ‘ అఆ ‘ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత నాగచైతన్య ప్రేమమ్ సినిమాతో అట్రాక్ట్ చేసారు. శతమానం భవతి సినిమాతో మంచి హిట్ కొట్టారు. ఇక కార్తికేయ 2 సినిమా పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ అయింది. ఆ తర్వాత బటర్ఫ్లై వంటి హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాల్లో నటించే స్థాయికి ఎదిగింది. అయితే అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించిన లేటెస్ట్ సినిమా ‘ టిల్లు స్క్వేర్ ‘. స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ సూపర్ హిట్ సినిమా ‘ డీజే టిల్లు ‘ కు సీక్వెల్ గా ఈ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే.
టిల్లు స్క్వేర్ పై మొదటి నుంచి సూపర్ బజ్ క్రియేట్ అయింది. తాజాగా వాలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేశారు. టిల్లు స్క్వేర్ Tillu Square Movie Trailer ట్రైలర్లో సిద్దు జొన్నలగడ్డ, Siddhu Jonnalagadda అనుపమ పరమేశ్వరన్ Anupama Parameswaran ఘాటు లిప్ లాక్ సీన్లతో విజృంభించారు. కారులో సిద్దు, అనుపమ ముద్దు సన్నివేశాలు ట్రైలర్ కే హైలైట్ అయింది. అందరి అటెన్షన్ ట్రైలర్ పై పడింది. అంతేకాకుండా మరో సీన్ లో కూడా సిద్దు అనుపమ లిప్ లాక్ అట్రాక్ట్ చేసింది. సిద్దు డైలాగులతోనే కాకుండా అనుపమ ముద్దుసీన్లతో కూడా ట్రైలర్ తెగ వైరల్ అయిపోతుంది. అయితే టిల్లు స్క్వేర్ ట్రైలర్ చూసిన అనుపమ ఫాన్స్ తెగ హర్ట్ అయినట్లు తెలుస్తోంది. ఇంతవరకు నువ్వు నా పిల్ల అనుకున్న ఇకపై బ్రేకప్ అంటూ నెటిజన్ కామెంట్ చేశాడు. ఇకపై నీ సినిమాలు చూడను అని మరో అభిమాని హర్ట్ అవుతూ కామెంట్ చేశాడు. ఇలాంటి రోల్స్ మనకెందుకు అను అంటూ మరొకరు స్పందించారు.
ఇలాంటి ఇల్లు స్క్వేర్ చూసి అనేకమంది అభిమానులు అనుపమ పరమేశ్వరన్ పై వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇలా అనుపమకు లవ్ బ్రేకప్ అంటూ అభిమానులు చెబుతున్నారు. మొదటి నుంచి సినిమాలో ఎంతో పద్ధతిగా, చీరకట్టు, ట్రెడిషన్ గా కనిపించిన అనుపమ ఎంతోమంది యువతకు ఫేవరెట్ గా నిలిచింది. ఇంట్లోనూ అమ్మాయిలు చూసి అనుపమ తొలిసారి ఆశిష్ హీరోగా చేసిన ‘ రౌడీ బాయ్స్ ‘ సినిమాలో లిప్ లాక్ సీన్లలో నటించి షాక్ ఇచ్చింది. అప్పుడే అనుపమ ముద్దు సీన్లపై అభిమానులు హర్ట్ అయ్యారు. అలాంటి సీన్లలో అనుపమను చూసి తట్టుకోలేకపోయారు. మళ్ళీ ఇప్పుడు సిద్దూతో అనుపమ చాలా ఘాటుగా లిప్ లాక్ సీన్లలో నటించేసరికి ఆమె అభిమానులు బ్రేకప్ చెబుతున్నారు. ఇలా మరోసారి అనుపమ పరమేశ్వరన్ హాట్ టాపిక్ అయ్యారు. ఇక టిల్లు స్క్వేర్ సినిమాకి మల్లికి రాం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా మార్చి 29న గ్రాండ్ గా విడుదల కాబోతుంది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.