Ooru Peru Bhairavakona Movie Review : యంగ్ హీరో సందీప్ కిషన్ లేటెస్ట్ గా నటించిన సినిమా ఊరు పేరు భైరవకోన మూవీ రివ్యూ . తెలుగులో మంచి మార్కెట్ ఉన్న సందీప్ కిషన్ కు సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. కుర్రాళ్లలో ప్రామిసింగ్ హీరో అనే ట్యాగ్ ను సొంతం చేసుకున్నారు. అయితే సందీప్ కిషన్ ఎక్కువగా ప్రయోగాలు చేస్తూ ఉంటారని అందరికీ తెలుసు. ఆ ప్రయోగాల్లో భాగంగా వచ్చిందే ఈ ఊరు పేరు భైరవకోన సినిమా. వాస్తవానికి సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది కానీ వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ ఫిబ్రవరి 14న పెయిడ్ ప్రీమియర్స్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఈరోజు ఫిబ్రవరి 16న వరల్డ్ వైడ్ గా ధియేటర్లలో విడుదల అయింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్స్ గా వర్ష బోల్లమ్మ, కావ్య థాపర్ నటించారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర సమర్పణలో హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండా ఈ సినిమాను నిర్మించారు. వీఐ ఆనంద్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. శేఖర్ చంద్ర సంగీతం అందించారు .ఇక ఈ సినిమాలోని నిజమేనే చెబుతున్నా లిరికల్ వీడియో ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది. ఇక ఈరోజు విడుదలైన ఊరు పేరు భైరవకోన సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా. . సందీప్ కిషన్ కు హిట్టు పడిందా లేదా..అంటే ఈ పూర్తి రివ్యూ తెలుసుకుందాం.
బసవ ( సందీప్ కిషన్ ) అతని స్నేహితుడు జాన్ ( వైవా హర్ష ) ఒక దొంగతనం చేసి అనుకోకుండా భైరవకోన అనే ఊరిలోకి ఎంటర్ అవుతారు. వీరితోపాటు గీత ( కావ్య థాపర్ ) కూడా ఆ ఊర్లోకి ఎంటర్ అవుతుంది. అక్కడి నుండి వీరి ముగ్గురికి విచిత్రమైన పరిస్థితిలు ఎదురవుతాయి. ముఖ్యంగా భైరవకోనలో అన్ని సంఘటనలు భయానకంగా ఉంటాయి. ఈ సమయంలో బసవ దొంగలించిన బంగారాన్ని రాజప్ప దక్కించుకుంటాడు. అవి తిరిగి దక్కించుకోవాలంటే బసవకు కుదరదు. అసలు ఆ భైరవకోనకి మిగతా ఊర్లకు తేడా ఏంటి..?గరుణ పురాణంలో మిస్సయిన నాలుగో పేజీలో భైరవకోన గురించి ఏమి చెప్పారు..? తాను ప్రేమించిన భూమి ( వర్షా బోల్లమ్మ ) కోసం బసవ ఎందుకు దొంగగా మారాడు. భైరవకోనలో ఎదురైన ట్విస్ట్ ఏంటి..?అలాంటి అన్ని ప్రశ్నలకు సమాధానమే ఊరు పేరు భైరవకోన సినిమా.
ఏదైనా కథ చెప్తే అది మనదై ఉండాలి. హీరో పాత్రలో మనల్ని మనం ఉంచుకోగలగాలి. కథలోని మెయిన్ కాన్సెప్ట్ కి కనెక్ట్ కావాలి. ఎంత ఫాంటసీ జోనర్ అయిన దానికి కూడా ఇదే రోల్ వర్తిస్తుంది. ఆనాటి పాతాళ భైరవి నుండి జగదేకవీరుడు అతిలోకసుందరి వరకు అమ్మోరు నుండి అరుంధతి వరకు అన్ని ప్రేక్షకులను ఎమోషనల్ గా టచ్ చేసిన సినిమాలే. ఆఖరికి మొన్నటికి మొన్న వచ్చిన బింబిసార కూడా ఈ కోవకే చెందుతుంది. ఎమోషనల్ మ్యాజిక్ క్రియేట్ చేయలేకపోయినా ఫాంటసీ చిత్రాలు ఏవి బాగా ఆడిన దాఖలాలు లేవు. దురదృష్టవశాత్తు ఊరు పేరు భైరవకోన కూడా ఇదే కోవలోకి వచ్చే సినిమా. అలా అని భైరవకోనలో ఎంగేజింగ్ కంటెంట్ లేదా అంటే కచ్చితంగా ఉంది. అక్కడక్కడ టెన్షన్ పుట్టించే సన్నివేశాలు కూడా ఉన్నాయి. కానీ లాజిక్ కి దూరంగా, ఎమోషన్ మిస్ అయిన ట బైరవకోనని గట్టెక్కించలేకపోయాయి. భైరవకోన పరిచయ సన్నివేశాలతో డైరెక్టర్ చాలా సులువుగా తన కథలోకి ప్రేక్షకుడిని తీసుకెళ్లాడు. ఎప్పుడైతే కథ భైరవకోనలోకి ప్రవేశిస్తుందో అక్కడినుండి సినిమాటిక్ లిబర్టీ చాలా ఎక్కువ అయిపోతుంది. కానీ ఫస్ట్ హాప్ లో బసవ, భూమి ట్రాక్ విడిగా నడుస్తూ ఉండడం భైరవకోన అసలు ట్విస్ట్ చివరి వరకు రివీల్ చేయకపోవడంతో ఓ మంచి ఫాంటసీ అడ్వెంచర్ మూవీ చూస్తున్నాం అని ఫీలింగ్ కలుగుతుంది. వీటికి తోడు వైవా హర్ష , వెన్నెల కిషోర్ కామెడీ కూడా బాగా వర్క్ అవుట్ అయింది. కానీ ఎప్పుడైతే ఇంటర్వెల్ ట్విస్ట్ రివ్యూ అవుతుందో అక్కడి నుండి భైరవకోన కథ సామాన్య ప్రేక్షకుడు ఊహించలేనంత దూరం వెళ్ళిపోతుంది.
భైరవకోన సెకండ్ ఆఫ్ కాస్త ఇంట్రెస్టింగ్ గా మొదలైన కథలోని ఒక్కొక్క ట్విస్ట్ రివ్యూ అవుతున్న ప్రేక్షకులు వాటి వేటికి పెద్దగా ఇంపాక్ట్ అయ్యే పరిస్థితి కనిపించదు. మధ్యలో వచ్చేలా లవ్ ట్రాక్ కూడా సినిమాని మరింత భారంగా మార్చేసింది. అన్నింటికి మించి అత్యంత బలహీనమైన క్లైమాక్స్ కూడా భైరవకోనకి పెద్ద మైనస్ గా మారింది. ఫస్ట్ ఆఫ్ లో జనరేట్ అయిన కాస్త రియాల్టీ కాస్త దగ్గరగా కథ ఉన్న భైరవకోన ఫలితం మరోలా ఉండేది. ఇక సినిమా కోసం సందీప్ కిషన్ ఎంత కష్టపడతాడు అందరికీ తెలుసుకష్టపడతాడు. ఈ సినిమాలో కూడా కష్టం కనిపించింది. కాకుంటే లుక్ పరంగా మాత్రం పెద్దగా గుడ్ వర్క్ జరగలేదు. ఇక భూమి పాత్రలో వర్షా, కావ్య థాపర్ కి కూడా కావలసినంత స్క్రీన్ స్పేస్ దొరకడం విశేషం. వైవా హర్ష , వెన్నెల కిషోర్ కామెడీ అదిరిపోయింది. మిగతా నటీనటుల నటన పర్వాలేదు. ఇక శేఖర్ చంద్ర సంగీతం బాగుంది. నిజమేనే చెబుతున్న పాట పెద్ద ఎసెట్. ఇక బిజిఎం కూడా ఆకట్టుకుంటుంది. సినిమా అంతా కథతో నిండిపోవడంతో ఎడిటర్ ఎక్కడ వేలు పెట్టడానికి లేకుండా పోయింది. కెమెరా వర్క్ ఓకే అనిపించింది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ మాత్రం బాగున్నాయి. ఇక డైరెక్టర్ వీఐ ఆనంద్ కాస్త తెలివి తగ్గించుకుని కథలు రాసుకుంటే మేకర్ దానిని అద్భుతంగా తెరకెక్కించగలడు. కానీ ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాలో తప్ప ఎక్కడ ఆనంద్ తన కథని సింపుల్గా చెప్పింది లేదు. ఆఖరికి భైరవకోనలో కూడా ఇదే రిపీట్ అయింది.
ఫస్ట్ ఆఫ్
ప్రధాన పాత్ర
కామెడీ
సెకండ్ హాఫ్
ఎమోషన్స్ మిస్ అవ్వడం
క్లైమాక్స్
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
This website uses cookies.