
మరణం కూడా వేరు చేయలేని పవిత్ర బంధం.. భర్త మరణించిన కొన్ని గంటల్లోనే భార్య మృతి..!
ఈ ప్రపంచంలో భార్యాభర్తలకు మించిన బంధం మరొకటి ఉండదు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే అన్ని బంధాల కంటే కూడా భార్య భర్తల బంధం చాలా బలంగా శాశ్వతంగా ఉంటుంది. ఇక ఈ భార్యాభర్తల బంధంలో ఒకరికోసం ఒకరు బతకడం జీవితం. ఇక అందుకు సజీవ సాక్ష్యం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు చెందిన వృద్ధ దంపతులు అని చెప్పాలి. ఎందుకంటే ఈ భార్యాభర్తల బంధాన్ని చివరకు చావు కూడా వేరు చేయలేకపోయింది.అందుకే ఆత్మీయ దంపతులకు ఆ జంట నిదర్శనం అని చెప్పాలి. వృద్ధాప్యంలో కూడా ఒకరికి ఒకరు తోడుగా ఉంటూ జీవనం సాగించారు. ఇక ఈ క్రమంలోనే మరణంలో కూడా వారి బంధం వేరుపడలేదు.ఎందుకంటే తన భర్త అనారోగ్యంతో చనిపోతే అదే రోజు భార్య బెంగతో ప్రాణాలు విడిచింది… పూర్తి వివరాల్లోకెళ్తే…
భార్యాభర్తల బంధం అంటే పాలు నీళ్లలా కలిసిపోవాలని మన పెద్దలు అంటూ ఉంటారు.ఎందుకంటే వేర్వేరుగా ఉన్నంతవరకే వాటిని పాలు, నీళ్లు అని చెప్పగలుగుతాం కానీ ఒక్కసారి ఆ రెండు కలిస్తే మాత్రం పాల ను నీళ్ల ను వేరు చేయడం ఏమాత్రం సాధ్యం కాదు. అదేవిధంగా ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమానురాగాలతో కూడిన ప్రేమ మొదలై భార్య భర్తల బంధం ఏర్పడిన తర్వాత ఆ దంపతులను వేరు చేయడం ఎవరికీ సాధ్యం కాదని చెప్పాలి. ఇక అలాంటిదే భద్రాది కొత్తగూడెం జిల్లాకు చెందిన ఈ వృద్ధ భార్యాభర్తల జీవనం అని చెప్పాలి.ఎందుకంటే మరణం లో కూడా వారి బంధం వేరుకాలేదు. అయితే భర్త అనారోగ్యంతో చనిపోవడంతో అదే రోజు భార్య తన భర్తపై బెంగ పెట్టుకొని ప్రాణాలు విడిచింది. ఈ విషాద ఘటన పినపాక మండలంలో చోటుచేసుకుంది. దీంతో ఆదర్శ దంపతులు హఠాన్మరణం అందర్నీ కంటతడి పెట్టించింది అని చెప్పాలి.
అయితే పినపాక మాజీ సర్పంచ్ సుంకరి రాములు గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారట.ఈ నేపథ్యంలోనే సోమవారం ఆరోగ్యం క్షీణించి సుంకరి రాములు మృతి చెందడం జరిగింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆమె భార్య నర్సమ్మ భర్త లేకుండా ఎలా బతకగలను అనుకుందో ఏమో కానీ అదే రోజు సాయంత్రం తనువు చాలించింది. అయితే తల్లిదండ్రులు ఇద్దరు ఒకేరోజు మరణించడంతో వారి పిల్లలు విలపించిన తీరు గ్రామస్తులను తీవ్ర కంటతడి పెట్టించింది.దీంతో రాములు నరసమ్మ దంపతులకు కలిపి అంతక్రియ కార్యక్రమాలు కుటుంబ సభ్యులు నిర్వహించారు. ఇక ఈ ఆదర్శ దంపతుల ఆంతిమ యాత్రలో గ్రామస్తులంతా పాల్గొని ఘనంగా నివాళి అర్పించారు.అయితే 80 ఏళ్ల వయసులో కూడా ఒకరిపై ఒకరు పెట్టుకున్న ప్రేమతో చివరికి ఒకేసారి మరణించి ఒకటయ్యారు. తనువు వేరైనా తాము ఒకటే అన్నట్లుగా ప్రపంచానికి ఈ ఆదర్శ దంపతులు చూపించారు అని చెప్పాలి.మరి వీరి పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి.
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
Dried Chillies | ఎండు మిర్చిని కేవలం వంటకు రుచి, సువాసన మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరమని…
Black In Color | ఆరోగ్యంగా, ఫిట్గా ఉండటానికి పండ్లు, కూరగాయలను మాత్రమే కాకుండా బ్లాక్ ఫుడ్స్ను కూడా ఆహారంలో…
This website uses cookies.