Anushka shetty : ప్ర‌భాస్ అనుష్క శెట్టి మ‌ధ్య అలా ప్రేమ పుట్టింద‌ట‌.. అస‌లు విష‌యం ఇది..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Anushka shetty : ప్ర‌భాస్ అనుష్క శెట్టి మ‌ధ్య అలా ప్రేమ పుట్టింద‌ట‌.. అస‌లు విష‌యం ఇది..!

Anushka shetty : టాలీవుడ్ క్యూట్ క‌పుల్స్‌లో ప్ర‌భాస్ అనుష్క జంట ఒక‌టి. వీరిద్ద‌రి సినిమాలు, పెళ్లి విష‌యాలు ఎప్ప‌టిక‌ప్పుడు చ‌ర్చనీయాంశంగా మారుతుంటాయి. ప్రభాస్ అనుష్కల ప్రేమ, పెళ్లి విషయంలో వార్తలు ట్రోల్ అవుతుంటే..ప్రముఖ జ్యోతిష్యుడు వినోద్ కుమార్ మాత్రం ప్రభాస్ పెళ్లెప్పుడనేది జోస్యం చెప్పేశాడు. రెబెల్‌స్టార్ పుట్టిన తేదీ ప్రకారం..త్వరలో పెళ్లి కానుందని..2022 అక్టోబర్ నుంచి 2023 అక్టోబర్ మధ్యకాలంలో జరగవచ్చని కూడా చెప్పేశాడు. ఇదంతా ట్రాష్ అని కొట్టిపారేసేవాళ్లు కూడా ఉన్నారు. అసలు పెళ్లెప్పుడు, […]

 Authored By sandeep | The Telugu News | Updated on :3 April 2022,10:15 pm

Anushka shetty : టాలీవుడ్ క్యూట్ క‌పుల్స్‌లో ప్ర‌భాస్ అనుష్క జంట ఒక‌టి. వీరిద్ద‌రి సినిమాలు, పెళ్లి విష‌యాలు ఎప్ప‌టిక‌ప్పుడు చ‌ర్చనీయాంశంగా మారుతుంటాయి. ప్రభాస్ అనుష్కల ప్రేమ, పెళ్లి విషయంలో వార్తలు ట్రోల్ అవుతుంటే..ప్రముఖ జ్యోతిష్యుడు వినోద్ కుమార్ మాత్రం ప్రభాస్ పెళ్లెప్పుడనేది జోస్యం చెప్పేశాడు. రెబెల్‌స్టార్ పుట్టిన తేదీ ప్రకారం..త్వరలో పెళ్లి కానుందని..2022 అక్టోబర్ నుంచి 2023 అక్టోబర్ మధ్యకాలంలో జరగవచ్చని కూడా చెప్పేశాడు. ఇదంతా ట్రాష్ అని కొట్టిపారేసేవాళ్లు కూడా ఉన్నారు. అసలు పెళ్లెప్పుడు, అనుష్కతో పెళ్లి ఉందా లేదా అనేది ప్రభాస్ మాత్రమే స్పష్టం చేయాలి. కాని ఈ ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమ పుట్టింద‌నే వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

టాలీవుడ్‌లో కొన్ని పర్ఫెక్ట్ ఆన్ స్క్రీన్ కపుల్స్ ఉన్నాయి. అందులో ఒకటి ప్రభాస్, అనుష్క. స్క్రీన్‌పై వీరి కెమిస్ట్రీ ఏ రేంజ్‌లో వర్కవుట్ అయ్యిందంటే వీరిద్దరు నిజంగానే రియల్ లైఫ్ కపుల్స్ అయితే బాగుండు అని ప్రేక్షకులు ఇప్పటికీ భావిస్తున్నారు. అయితే గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న అనుష్క.. ప్రభాస్‌తో మరోసారి రీ ఎంట్రీ ఇవ్వనుందట. ప్రభాస్.. అనుష్క సినిమా అంటే ఫ్యాన్స్‌కు పండగే. వీరిద్దరు కలిసి నటించిన మిర్చీ, బాహుబలి సినిమాలు సూపర్ డూపర్ అయ్యాయి. అయితే మరోసారి ఈ హిట్ కాంబో రిపీట్ కానుంది. ప్రముఖ డైరెక్టర్ మారుతితో కలిసి కొత్త సినిమా చేయడానికి ప్రభాస్ సంతకం పెట్టాడు.

anushka shetty in love with prabhas

anushka shetty in love with prabhas

Anushka shetty : ఈ కాంబినేష‌న్ క్రేజీ గురూ..

రాజా డీలక్స్ అనే టైటిల్ తో ఈ హారర్-కామెడీ చిత్రం తెరకెక్కనుంది. 2013లో విడుదలైన ప్రేమ కథా చిత్రమ్‌ సినిమాకు మారుతి నిర్మాతగా పనిచేశారు. అయితే డార్లింగ్ ప్రభాస్ ఈ సినిమాలో అనుష్కతో పాటు మరో ఇద్దరు హీరోయిన్లతో రోమాన్స్ చేయనున్నాడు. అనుష్కతో పాటు మాళవిక మోహనన్, శ్రీలీల కూడా రాజా డీలక్స్‌లో కనిపించనున్నారు. . అయితే ఇందులో మెయిన్ హీరోయిన్‌గా అనుష్కను సెలక్ట్ చేసిందట మూవీ టీమ్. ఒకవేళ ప్రభాస్, అనుష్క మరోసారి కలిసి నటిస్తే అక్కడే సినిమా సగం సూపర్ హిట్ అని భావిస్తున్నారు అభిమానులు. అంటే ప్ర‌భాస్‌తో మ‌రోసారి అనుష్క రొమాన్స్ చేయ‌నుంద‌నే స‌రికి
అభిమానుల ఆనందం హ‌ద్దులు దాటుతుంది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది