Anushka Shetty : పెళ్లి పీటలెక్కబోతున్న అనుష్క శెట్టి.. స్వీటీకి కాబోయే వ్యక్తి దుబాయ్‌లో బిజినెస్ మెన్..?
Anushka Shetty : అనుష్క శెట్టి.. ప్రస్తుతం ఈ పేరు తెలుగు ఇండస్ట్రీలో సరిగా వినిపించడం లేదు. బాహుబలి సినిమా తర్వాత అనుష్క చూద్దామన్నా ఎక్కడా కనిపించడం లేదు. దీనికి కారణం ఆమె ఓవర్ వెయిట్ అండ్ హైట్ వల్లే సినిమా చాన్సులు రావడం లేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రభాస్ లాంటి పర్సనాలిటీ ఉన్నవారికి మాత్రమే అనుష్క పర్సనాలిటీ సెట్ అవుతుందని కానీ మిగతా హీరోలకు అనుష్క ఆంటీలాగా కనిపిస్తుందని కూడా కొందరు అంటున్నారు. అంతేకాకుండా అనుష్క వయస్సు కూడా మూడు పదులు ఎప్పుడో దాటి పోయింది. 40 ఏళ్ల హీరోయిన్ సరసన నటించడానికి పెద్దగా ఎవరూ ఇష్టపడటం లేదని కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.
Anushka Shetty : అనుష్క పెళ్లి చేసుకునేది అతన్నేనా..
టాలీవుడ్‌లో హీరోయిన్ అనుష్క శెట్టి గురించి అప్పట్లో పెద్దగా పరిచయం అవసరమే లేదు.టాప్ హీరోయిన్ల జాబితాలో అనుష్క నంబర్ వన్ స్థానంలో ఉండేది. నాగార్జున నటించిన సూపర్ సినిమాతో తొలిసారి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అనుష్క.. వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. దాదాపుగా స్టార్ హీరోలు అందరితోనూ ఆడిపాడింది. ప్రస్తుతం సినీ అవకాశాలు తగ్గిపోవడంతో అనుష్క పెళ్లి చేసుకోబోతుందని వార్తలు జోరుగా వస్తున్నాయి. వయస్సు పెరుగుతున్నందున స్వీటీ పెళ్లి చేసుకోవాలని ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. అనుష్క ఇప్పటికీ కూడా హీరోయిన్‌గా పలు సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తుందట..అరుంధతి, భాగమతి, నిశ్శబ్దం వంటి లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేసిన అనుష్క..ఒకవేళ హీరోయిన్ అవకాశాలు రాకపోతే నటనకు ప్రాధాన్యమున్న సినిమాలు చేయాలని భావిస్తోందట.
అప్పట్ల ప్రభాస్ ,అనుష్క చాలా క్లోజ్‌గా ఉండేవారు. దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని..త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారని వార్తలు వచ్చాయి. కానీ తామిద్దరం మంచి ఫ్రెండ్స్ అని పెళ్లి చేసుకోబోమని అనుష్క క్లారిటీ ఇచ్చింది. తాజాగా నెట్టింట ఓ వార్త వైరల్ అవుతోంది. ఒక బడా బిజినెస్ మెన్‌ను అనుష్క త్వరలోనే పెళ్లి చేసుకోబోతోందని కథనాలు వస్తున్నాయి.అతను కూడా బెంగళూరుకు చెందిన వ్యక్తి అని అంటున్నారు. మరికొందరు మాత్రం దుబాయ్‌లో సెటిల్ అయిన బిజినెస్ మెన్ అని కూడా వార్తలు వస్తున్నాయి. స్వీటీ పేరెంట్స్ కూడా ఇప్పటికైనా పెళ్లిచేసుకోవాలని కోరుతున్నారట.. కానీ అనుష్క మాత్రం పెళ్లికి సుముఖంగా లేదని సన్నిహితుల నుంచి వస్తున్న సమాచారం.ఇందులో ఏది నిజమో తెలియాలంటే స్వీటీ స్వయంగా స్పందిస్తే గానీ క్లారిటీ రాదు.