Anasuya : ఆంటీ అంటే ఊరుకునేదే లేదు.. అనసూయ చివరి హెచ్చరిక
Anasuya : పెళ్లి అయ్యి తల్లి అయిన వాళ్లందరిని కూడా ఎక్కువ శాతం మంది ఆంటీ అంటూ పిలవడం మన చుట్టు కనిపించే కామన్ విషయం. చిన్న వయసులో పెళ్లి చేసుకుని తల్లి అయితే నా అంత వయసు ఉన్న వాడు కూడా నన్ను ఆంటీ అంటున్నాడు అంటూ మన చుట్టు ఉన్న ఆడవారు కూడా తిట్టుకోవడం మనం రెగ్యులర్ గా చూస్తూ ఉంటాం. సాదారణ ఆడవారిని ఆంటీ అంటే వారు మనసులో తిట్టుకుని ఊరుకుంటారు.. కానీ అనసూయ సాదారణ మహిళ కాదు కదా.. ఆమె తనను ఆంటీ అంటే మొదటి నుండి ఊరుకోదు.. ఇప్పుడు కూడా ఆమె అంటీ అంటే తీవ్రంగా ప్రతిఘటిస్తూ వస్తోంది. ఈ విషయం ఇప్పుడు తారా స్థాయికి చేరింది. తాజాగా అనసూయ ఒక హీరోను ఉద్దేశించి ఆ హీరో సినిమా ఫ్లాప్ అయినందుకు సంతోషం అన్నట్లుగా ఇండైరెక్ట్ గా ట్వీట్ చేసిన విషయం తెల్సిందే.
ఆ ట్వీట్ లో సదరు హీరో పేరును ప్రస్థావించకున్నా కూడా ఆ హీరో అభిమానులు తీవ్ర స్థాయిలో మండి పడుతున్నారు. తమ అభిమాన హీరో గురించి తప్పుగా మాట్లాడుతావా అంటూ ఓ రేంజ్ లో అనసూయను టార్గెట్ చేయడం మొదలు పెట్టారు. అందులో భాగంగా అనసూయను ఎక్కువ శాతం మంది ఆంటీ అంటూ సంబోదిస్తూ కామెంట్స్ చేశారు. ఆమెను విమర్శించే వారితో పాటు కొందరు ఆమెను సమర్థించే వారు కూడా ఆంటీ అంటూ ట్వీట్స్ చేయడం తో ఆమె కు తిక్క రేగింది. ఆంటీ అంటూ తన యొక్క వయసు షేమింగ్ చేస్తున్న ప్రతి ఒక్కరి పట్ల తీవ్రమైన చర్యలు తప్పవు అన్నట్లుగా ఆమె హెచ్చరించింది. ప్రతి ఒక్క స్క్రీన్ షాట్ ను తాను సేకరిస్తున్నట్లుగా పేర్కొంది. ఆంటీ అంటూ తన యొక్క వయసు గురించి మళ్లీ మళ్లీ బ్యాడ్ కామెంట్స్ చేయడం.. నా యొక్క డ్రస్ గురించి.. నా యొక్క వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడటం పట్ల ఆమె సీరియస్ అయ్యింది.
ఇదే చివరి వార్నింగ్ అంటూ హెచ్చరించింది. మళ్లీ ఆంటీ అంటూ ఏజ్ షేమింగ్ చేస్తే మాత్రం పోలీసుల వరకు వెళ్ల వలసి ఉంటుంది.. ప్రతి ఒక్కరి పట్ల తీవ్రమైన చర్యలు తీసుకోబోతున్నట్లుగా కూడా ఆమె పేర్కొంది. ప్రస్తుతం ఈ విషయం జాతీయ స్థాయిలో ట్రెండ్ అవుతుంది. అనసూయ అలా అనవద్దంటూ హెచ్చరించినా కూడా కొందరు కావాలనీ మరీ ఆమెను రెచ్చగొట్టే విధంగా అలాంటి ట్వీట్స్ చేస్తున్నారు. దాంతో ఆమె మరిన్ని మెసేజ్ లు చేస్తూ వాటికి రిప్లైలు ఇస్తూ వస్తుంది. ఈ వ్యవహారం కాస్త సీరియస్ గానే సాగుతోంది. అనసూయ అతి ని కొందరు విమర్శిస్తూ ఉంటే మరి కొందరు మాత్రం ఈ విషయంలో ఆమెను సమర్థిస్తూ వస్తున్నారు. మొత్తానికి జాతీయ స్థాయిలో అనసూయ ట్విట్టర్ లో ట్రెండ్ అవుతోంది.