Anushka Shetty : నేను పెళ్లి చేసుకోబోయేది అతన్నే.. ఎవరనేది ఇప్పుడే రివీల్ చేయనన్న అనుష్క
ప్రధానాంశాలు:
Anushka Shetty : నేను పెళ్లి చేసుకోబోయేది అతన్నే.. ఎవరనేది ఇప్పుడే రివీల్ చేయనన్న అనుష్క
Anushka Shetty : టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎప్పటికప్పుడు కొత్త భామలు పరిచయం అవుతున్నారు.అయిన కూడా కొందరు సీనియర్స్ మాత్రం తమ సత్తా చాటుతూనే ఉన్నారు. అలాంటి వారిలో అనుష్క శెట్టి ఒకరు. చాలా ఏళ్లుగా టాలీవుడ్‌లో సందడి చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పటికీ క్రేజీ ప్రాజెక్టులు చేస్తూనే ఉంది. అనుష్క శెట్టి.. అక్కినేని నాగార్జున నటించిన ‘సూపర్’ అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించింది. ఆ తర్వాత తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఫిదా చేసి.. మరిన్ని ఆఫర్లను అందుకుంది. ఇలా ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీలలో భాగం అయింది. దీంతో అనుష్క తక్కువ సమయంలోనే స్టార్‌గా మారింది. దీంతో టాలీవుడ్‌లో ఆమె సెన్సేషన్ అయిపోయింది.
Anushka Shetty నేను చూసుకున్నాను..
అయితే గతంలో లాగా వేగంగా సినిమాలు చేయడం లేదు. అనుష్క చివరగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే సూపర్ హిట్ చిత్రంలో నటించింది. అనుష్క ఒకే చెప్పాలే గాని ఆమెతో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. అనుష్క సినిమాలతో పాటు తన పర్సనల్ లైఫ్ వ్యవహారాలతో కూడా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. అనుష్క వయసు ప్రస్తుతం 42 ఏళ్ళు. కానీ ఇంత వరకు అనుష్క పెళ్లి చేసుకోలేదు. కాని ఆమె పెళ్లి గురించి నెట్టింట అనేక ప్రచారాలు జరుగుతుండడం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ రూమర్స్ అన్ని ఫేక్ అని అనుష్క ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూ వస్తోంది. అయితే జయప్రద హోస్ట్ గా చేసిన ఒక షోకి అనుష్క అతిథిగా హాజరైంది.
ఆ షోలో అనుష్క తన పెళ్లి గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం బిజీగా ఉన్నాను. రెండు మూడేళ్ళలో పెళ్లి చేసుకుంటాను. ఎందుకంటే కెరీర్ ఎంత ముఖ్యమో పెళ్లి కూడా అంతే ముఖ్యం అని అనుష్క తెలిపింది. రెండు మూడేళ్లు అంటే లేట్ అవుతుందేమో కదా అని జయప్రద అంటే అనుష్క నవ్వేసింది. ఆ షో జరిగి పదేళ్ల పైన అయిపోయినా అనుష్క ఇంకా పెళ్లి కూతురు కాలేదు. నీకు కాబోయే వాడిని మీ ఇంట్లో వాళ్లే చూస్తారా లేక లవ్ ఏమైనా ఉందా అని జయప్రద అడిగింది. నేను ఆల్రెడీ నాకు కాబోయే వాడిని చూసుకున్నా అంటూ అనుష్క అప్పట్లో బాంబు పేల్చింది. అయితే అతడి పేరు మాత్రం చెప్పను. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తారు. మేమిద్దరం ఒక అభిప్రాయానికి వచ్చాం. కరెక్ట్ టైంలో పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయినట్లు అనుష్క తెలిపింది.ఇక నాకు హీరోలు, కెమెరామెన్స్‌తో కూడా పెళ్లి అవుతున్నట్టు పుకార్లు పుట్టించారని కూడా అనుష్క పేర్కొంది.