Anushka Shetty : అనుష్క పోస్ట‌ర్‌తో 40 యాక్సిడెంట్స్ జ‌రిగాయా?

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Published on: June 5, 2025, 7:00 pm
  •  Anushka Shetty : అనుష్క పోస్ట‌ర్‌తో 40 యాక్సిడెంట్స్ జ‌రిగాయా..?

Anushka Shetty : 2005లో సూపర్ సినిమాతో వెండితెరకు పరిచయమైన అనుష్క గ్లామ‌రస్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. స్టార్ హీరోల ప‌క్కన న‌టిస్తూనే లేడి ఓరియెంటెడ్ చిత్రాలు చేసింది. అరుంధతి, రుద్రమ దేవి, భాగమతి, సైజ్ జీరో, నిశ్శబ్ధం తదితర లేడీ ఓరియంటెడ్ మూవీస్ అనుష్క‌కి మంచి పేరు తీసుకొచ్చాయి. అనుష్క త్వరలో మరో లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ తో మన ముందుకు రానుంది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో అనుష్క నటించిన ఘాటి త్వరలోనే థియేటర్లలోకి రానుంది.

Anushka Shetty : అనుష్క పోస్ట‌ర్‌తో 40 యాక్సిడెంట్స్ జ‌రిగాయా?

Anushka Shetty : అనుష్క పోస్ట‌ర్‌తో 40 యాక్సిడెంట్స్ జ‌రిగాయా?

Anushka Shetty ఎంత ప‌ని చేశావ్..

అనుష్క ఎన్ని సినిమాలైనా చేసి ఉండచ్చుగాక.. ఆమె కెరీర్ లో బాగా గుర్తుండిపోయే సినిమాల్లో వేదం ఒకటి. ఇందులో ఆమె వేశ్య పాత్ర వేసి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. వేదం సినిమా సమయంలో ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. వేదం సినిమా నుంచి అనుష్క పసుపు చీర కట్టుకొని వెనక్కి తిరిగి చూస్తున్న స్టిల్స్ ని ప్రమోషన్స్ కోసం బాగా వాడారు. హైదరాబాద్ లోని చాలా చోట్ల అనుష్క ఫొటోని హోర్డింగ్ గా పెట్టారట.

పంజాగుట్ట సర్కిల్ లో కూడా అనుష్క వెనక్కి తిరిగి చూస్తున్న ఫొటోని పెద్ద హోర్డింగ్ గా పెట్టడంతో చాలా యాక్సిడెంట్స్ జ‌రిగాయ‌ట‌. పోస్ట‌ర్‌ని చూస్తూ డ్రైవ్ చేయ‌డం వ‌ల‌న దాదాపు 40 యాక్సిడెంట్స్ జ‌రిగాయ‌ట‌. ఈ విష‌యాన్ని ద‌ర్శ‌కుడు క్రిష్ చెప్పుకొచ్చాడు. వేదం సినిమా 15 ఏళ్ల పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా తాను ఈ విష‌యాన్ని తెలియ‌జేశాడు. అయితే రెగ్యులర్ గా యాక్సిడెంట్స్ జరుగుతుండడాన్ని గమనించిన పోలీసులు GHMC అధికారులతో కలిసి అనుష్క హోర్డింగ్ ని తొలగించారట.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp