2024 Rewind : ప్రతి ఏడాది కూడా మనం కొన్ని విషాదవార్తలని వినాల్సి వస్తుంది. ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్న సెలబ్రిటీలు ఊహించని విధంగా కన్నుమూస్తుండడం అభిమానులకి తీరని విషాదాన్ని మిగిలిస్తుంది. అయితే మరి కొద్ది రోజులలో ఈ ఏడాది ముగియనున్న నేపథ్యంలో 2024లో కన్నుమూసిన ప్రముఖుల కొందరు దిగ్గజాలని స్మరించుకుందాం. “బీహార్ కోకిల”గా పిలువబడే శారదా సిన్హా గొంతు ఇక వినబడదు. డిసెంబర్ 15, 2024న 70 ఏళ్ల వయసులో ఆమె తుదిశ్వాస విడిచారు. జానపద గీతాలతో, ముఖ్యంగా ఛత్ పూజ పాటలతో ఆమె ఎంతో మంది హృదయాలను గెలుచుకున్నారు. బ్లడ్ క్యాన్సర్ తో కొంతకాలం పోరాడిన తర్వాత ఆమె కన్నుమూశారు.
బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితులైన నటుడు రితురాజ్ ఫిబ్రవరి 20, 2024న హఠాత్తుగా గుండెపోటుతో కన్నుమూయడం చాలా మందిని బాధించింది. 48 ఏళ్ల వయస్సులో ఆయన మరణం ప్రతి ఒక్కరిని కలిచి వేసింది. ఇక నటుడు వికాస్ నిధి కూడా సెప్టెంబర్ 8, 2024న 48 ఏళ్ల వయసులో గుండెపోటుతో మరణించడం విషాదకరం. ఈ ఇద్దరు నటులు తమ నటనతో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. నటనారంగంలో తమదైన ముద్ర వేసిన లీలా మజుందార్ (బెంగాలీ, హిందీ నటి) జనవరి 27న 65 ఏళ్ల వయసులో కన్నుమూశారు.
‘దంగల్’ చిత్రంతో బాలీవుడ్‌లో వెలుగు వెలిగిన సుహాని భట్నాగర్ (బబితా ఫోగట్ పాత్ర) ఫిబ్రవరి 14న కేవలం 19 ఏళ్ల వయసులోనే అనారోగ్యంతో మృతి చెందడం విషాదకరం. గజల్ గానంతో ఎంతోమంది హృదయాలను హత్తుకున్న పంకజ్ ఉధాస్ ఫిబ్రవరి 26న 72 ఏళ్ల వయసులో కన్నుమూశారు. మరాఠీ సంగీత ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న అతుల్ పర్చే 57 ఏళ్ల వయసులో క్యాన్సర్‌తో పోరాడుతూ తుదిశ్వాస విడిచారు.తబలా విద్వాంసుడిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన జాకీర్ హుస్సేన్ డిసెంబర్ 16న 72 ఏళ్ల వయసులో ఊపిరితిత్తుల వ్యాధితో మరణించారు.. రామోజీ గ్రూప్, రామోజీ ఫిల్మ్ సిటీ వ్యవస్థాపకుడు రామోజీ రావు జూన్ 8న 87 ఏళ్ల వయసులో కన్నుమూశారు.
హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో దిగ్గజంగా పేరుగాంచిన ఉస్తాద్ రషీద్ ఖాన్ జనవరి 9న 55 ఏళ్ల వయసులో కన్నుమూశారు. భారతదేశపు ప్రముఖ పారిశ్రామికవేత్త, దాత రతన్ టాటా అక్టోబర్ 9, 2024న 86 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆయన వ్యాపార రంగానికి, సమాజానికి చేసిన సేవలు అజరామరమైనవి. ఫ్యాషన్ ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన డిజైనర్ రోహిత్ బల్ నవంబర్ 1, 2024న 62 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆయన సృష్టించిన డిజైన్లు ఫ్యాషన్ ప్రియులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇంకా బలగం మూవీ యాక్టర్ మొగిలయ్య కూడా మరణించారు.
LPG Gas : దేశవ్యాప్త వ్యాపారులకు శుభవార్త. Indian Oil Gas ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే చమురు మార్కెటింగ్ కంపెనీలు…
Drunk And Drive : కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ Hyderabad నగరంలో మంగళవారం రాత్రి భారీగా డ్రంక్…
Drunk Man : మత్తెక్కేదాకా తాగడం.. ఆ తర్వాత తింగరి పనులు చెయ్యడం.. మందుబాబులకు సహజమే. ఎక్కిన కిక్ దిగదు,…
Anasuya : హ్యాపీ న్యూ ఇయర్ Happy New Year అంటూ తన గ్లామర్ ట్రీట్ తో షాక్ ఇచ్చింది…
New Year : హుషారెత్తే సంగీతం, నృత్యాలు, పార్టీలతో న్యూ ఇయర్కు New Year అంతా గ్రాండ్గా స్వాగతం పలికారు.…
New Year Uppal : ప్రపంచం New Year 2025 ప్రారంభానికి గొప్ప స్వాగతం పలికింది. ఈ క్రమంలో రాష్ట్రం…
Chicken Bones : ప్రస్తుత కాలంలో నాన్ వెజ్ ప్రియులు ఎక్కువగా తినే మాంసంలో చికెన్ ఒకటని చెప్పాలి. చిన్న…
Smile depression : ప్రస్తుత కాలంలో మారిన ఆహారపు అలవాట్లు మరియు పని ఒత్తిడి Smile Depression కారణంగా చాలామంది…
This website uses cookies.