2024 Rewind : ఈ ఏడాది క్రీడా అభిమానులకి తీరని శోకం.. నింగికెగసిన దిగ్గజాలు ఎవరంటే..!
ప్రధానాంశాలు:
2024 Rewind : ఈ ఏడాది క్రీడా అభిమానులకి తీరని శోకం.. నింగికెగసిన దిగ్గజాలు ఎవరంటే..!
2024 Rewind : ఈ ఏడాది ఫుట్ బాల్ ప్రపంచం నివ్వెరపోయేలా చేసిన సంఘటనలు కొన్ని ఉన్నాయి. ఫుట్‌బాల్ ప్రపంచకప్ విజేతలు ఫ్రాంజ్ బెకెన్‌బౌర్, మారియో జగాల్లో.. భారత క్రికెట్ గ్రేట్ వాల్ అన్షుమాన్ గైక్వాడ్‌తో పాటు ఇతర క్రీడా దిగ్గజాలు ఈ ఏడాదే మరణించారు. అసాధారణ ప్రదర్శనతో పాటు సంచలన విజయాలతో అభిమానుల మనసులను గెలుచుకున్న క్రీడా తారాలు ఈ ఏడాదే నేల రాలారు.మరి కొద్ది రోజులలో ఈ ఏడాది ముగుస్తున్న నేపథ్యంలో వారిని ఒక్కసారి స్మరించుకుందాం.. ముందుగా ఫ్రాంజ్ బెకెన్ బౌర్ అకాల మరణం ఫుట్‌బాల్ ప్రపంచాన్ని విషాదంలో ముంచెత్తింది.
2024 Rewind : తీరని విషాదం..
ఆటగాడిగా.. కోచ్‌గా ఫిఫా ప్రపంచకప్ గెలిచిన ముగ్గురు వ్యక్తుల్లో ఫ్రాంజ్ బెకెన్‌బౌర్ ఒకరు. మైదానంలో అతను సాధించిన ఘనతలు అసాధారణమైనవి. 78 ఏళ్ల వయసులో ఫ్రాంజ్ బెకెన్‌బౌర్ తుది శ్వాస విడిచాడు. ఫ్రాంజ్ బెకెన్‌బౌర్ మరణానికి నివాళిగా ఆయన మాజీ ఫుట్‌బాల్ క్లబ్ బయెర్న్ ముంచి జెర్సీ నెంబర్ 5కి రిటైర్మెంట్ ప్రకటించింది. దిగ్గజ క్రికెటర్ అన్షుమాన్ గైక్వాడ్ మరణం ఈ ఏడాది భారత క్రికెట్‌లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. క్యాన్సర్‌తో సుదీర్ఘ పోరాటం చేసిన ఆయన 71 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారు. గైక్వాడ్ 40 టెస్ట్ మ్యాచ్‌లు మరియు 15 వన్డేలు ఆడారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2000లో రన్నరప్‌గా నిలిచిన భారత జట్టుకు కోచ్‌గా కూడా అన్షుమన్ గైక్వాడ్ పనిచేశారు.
గ్రేట్ ఇంగ్లీష్ బౌలర్ డెరెక్ అండర్‌వుడ్ ఈ ఏడాదే తుది శ్వాస విడిచారు. డెడ్లీ స్పిన్ బౌలర్‌గా పేరొందిన అండర్‌వుడ్.. మూడు దశాబ్దాల కెరీర్‌లో మొత్తం 1087 మ్యాచ్‌లు ఆడి 3037 వికెట్లు పడగొట్టాడు. అతని మరణం తీవ్ర విషాదాన్ని కలిగించింది. ఇక బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం మారియో జాగల్లో 92 ఏళ్ల వయసులో ఈ ఏడాదే తుది శ్వాస విడిచారు. జాగల్లో ఏకంగా నాలుగు సార్లు ఫిఫా ప్రపంచకప్ గెలిచారు. ఇందులో రెండు సార్లు ఆటగాడిగా.. మరో రెండు సార్లు కోచ్‌గా విశ్వ టైటిల్‌ను అందుకున్నాడు. ఆటగాడిగా.. కోచ్‌గా మారియో ఫుట్‌బాల్‌కు ఎంతో సేవ చేశారు. ఇలా పలువురు ఫుట్ బాల్ ఆటగాళ్లు, క్రికెట్ ఆటగాళ్లు తీరని లోకానికి వెళ్లారు. వారందరి మరణం క్రీడా లోకం నివ్వెరపోయేలా చేసింది అని చెప్పాలి.