Nitish Kumar Reddy : బోర్డర్ -గవాస్కర్ ట్రోఫీలో ఆసక్తికరమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం నాలుగో టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా జరుగుతుండగా, ఈ రోజు ఉదయం 9 వికెట్ల నష్టానికి 358 పరుగులతో నాలుగో రోజు ఆటను ఆరంభించిన టీమిండియా ఇన్నింగ్ ఎక్కువ సేపు కొనసాగలేదు. సెంచరీ హీరో నితీష్ కుమార్ రెడ్డి త్వరగా అవుట్ అయ్యాడు. 114 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద నాథన్ లియన్ బౌలింగ్‌లో మిఛెల్ స్టార్క్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో 369 పరుగుల వద్ద టీమిండియా ఆలౌట్ అయింది. ఇక ఆ తర్వాత వికెట్ల పతనం ఆస్ట్రేలియా ఇన్నింగ్‌లోనూ కొనసాగింది. టీమిండియా పేస్ బౌలర్లు జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ వెంటవెంటనే వికెట్లు పడగొట్టారు.
ఓపెనర్ సామ్ కొన్‌స్టాస్‌ను బుమ్రా, ఉస్మాన్ ఖవాజాను మహ్మద్ సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేశారు. 13 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద సిరాజ్ బౌలింగ్‌లో టాప్ ఆర్డర్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ వికెట్ కీపర్ రిషభ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చాడు.లబుషేన్ ఒక్కడే చాలా పోరాడాడు. మిగతా బ్యాట్స్‌మెన్ మాత్రం ఘోరంగా తేలిపోయారు. ఇక చివరలో లియాన్, బోలండ్ భారత బౌలర్స్ ని చాలా పరీక్షించారు. అయితే మూడో రోజు హైలైట్‌గా నిలిచిన నితీష్ కుమార్ రెడ్డి. టెస్టుల్లో సెంచరీ బాదాడు. 10 ఫోర్లు, ఒక భారీ సిక్సర్‌తో పరుగుల వరద పారించాడు. వంద పరుగులను అందుకున్నాడు. నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో వాషింగ్టన్ సుందర్ అతనికి సహకరించాడు. అర్ధసెంచరీ చేశాడు సుందర్. సరిగ్గా 50 పరుగులు చేసిన తరువాత సుందర్ అవుట్ అయ్యాడు.
99 పరుగుల వద్ద ఫోర్ కొట్టి మరీ తొలి సెంచరీని అందుకున్నాడు నితీష్ కుమార్ తెగువకు అద్దం పట్టింది. బంతి బౌండరీ దాటిన వెంటనే అతన ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది. స్టేడియంలో ప్రత్యక్షంగా మ్యాచ్ తిలకిస్తోన్న అతని తండ్రి ముత్యాల రెడ్డి ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ఈ ఉదయం నితీష్ కుమార్ రెడ్డి కుటుంబం.. టీమిండియా లెజెండర్ సునీల్ గవాస్కర్‌ను కలిసింది. ఈ సందర్భంగా ముత్యాల రెడ్డి సునీల్ గవాస్కర్ కాళ్లు మొక్కాడు. ఆయన ఆశీర్వాదాన్ని తీసుకున్నాడు. ఆనంద భాష్పాలు రాల్చాడు. సునీల్ గవాస్కర్ సైతం భావోద్వేగానికి గురయ్యాడు. ఓ తండ్రిగా గర్వించదగ్గ క్షణం అంటూ వ్యాఖ్యానించాడు. కొడుకు కోసం ముత్యాలరెడ్డి చేసిన ఎంతో త్యాగం చేశారని, ఉద్యోగాన్ని సైతం వదులుకున్న విషయం తన దృష్టికి వచ్చిందని పేర్కొన్నాడు.
Rythu Bharosa : తెలంగాణ Telangana ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తుండడం మనం చూస్తూ…
LPG Gas : దేశవ్యాప్త వ్యాపారులకు శుభవార్త. Indian Oil Gas ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే చమురు మార్కెటింగ్ కంపెనీలు…
Drunk And Drive : కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ Hyderabad నగరంలో మంగళవారం రాత్రి భారీగా డ్రంక్…
Drunk Man : మత్తెక్కేదాకా తాగడం.. ఆ తర్వాత తింగరి పనులు చెయ్యడం.. మందుబాబులకు సహజమే. ఎక్కిన కిక్ దిగదు,…
Anasuya : హ్యాపీ న్యూ ఇయర్ Happy New Year అంటూ తన గ్లామర్ ట్రీట్ తో షాక్ ఇచ్చింది…
New Year : హుషారెత్తే సంగీతం, నృత్యాలు, పార్టీలతో న్యూ ఇయర్‌కు New Year అంతా గ్రాండ్‌గా స్వాగతం పలికారు.…
New Year Uppal : ప్రపంచం New Year 2025 ప్రారంభానికి గొప్ప స్వాగతం పలికింది. ఈ క్రమంలో రాష్ట్రం…
Chicken Bones : ప్రస్తుత కాలంలో నాన్ వెజ్ ప్రియులు ఎక్కువగా తినే మాంసంలో చికెన్ ఒకటని చెప్పాలి. చిన్న…
This website uses cookies.