Ariyana : ఆ హీరోపై క్రష్.. అమ్మ బాబోయ్ అరియానా మామూల్ది కాదు!

Authored By Cinema Desk | The Telugu News | Updated on : 23 January 2021, 9:48 am

Ariyana ఏ క్షణాన అరియానా ఆర్జీవీని ఇంటర్వ్యూ చేసిందో గానీ దశ తిరిగిపోయింది. ఆర్జీవీ నాటు కామెంట్లు చేయడం ఏంటో.. అరియానా మెలికలు తిరిగిపోవడం ఏంటో.. ఆ వీడియోలు అంతగా వైరల్ అయి ఏకంగా బిగ్ బాస్ టీంలో పడటం ఏంటో ఎవ్వరికీ అర్థం కాలేదు. మొత్తానికి బిగ్ బాస్ షోలోకి వచ్చింది. చివరకు నిలిచింది. టాప్ 5కి అర్హురాలేనంటూ అందరి చేత శభాష్ అనిపించుకుంది. ఆమె తనకున్న అతిని కాస్త తగ్గించుకుంటే రన్నర్ అయ్యో అవకాశం కూడా ఉండేది.

Ariyana about Naga shaurya

Ariyana about Naga shaurya

అరియానాకు ఉన్న ఆ అతే ప్లస్ మైనస్ అయింది. ఆ అతి వల్లే అంత దూరం ప్రయాణించగలిగింది. ఆ అతి వల్ల టాప్ 4లోనే ఆగిపోయింది. అయితే అరియానా ఫ్యాన్ బేస్ బాగా పెరిగిండి. డేరింగ్ అండ్ డాషింగ్.. ఏదైనా సరే ముక్కుసూటిగా మాట్లాడేతత్త్వం ఇలా అన్నీ కూడా జనాలకు బాగా నచ్చాయి. అలా ప్రతీసారి అరియానా సేవ్ అవుతూనే వచ్చింది. చివరి వారాల్లో జరిగిన సంఘటనల కారణంగా టాప్ 2, 3లో ఉండాల్సిన అరియానా టాప్ 4కే పరిమితమైంది.

Ariyana :  పెరిగిన క్రేజ్‌ను చూసి గాల్లో తేలిపోతున్న అరియానా

అయితే బయటకు వచ్చిన తరువాత అరియానా తన ఫాలోయింగ్‌ను చూసి ఫిదా అయిపోయింది. తనకు పెరిగిన క్రేజ్‌ను చూసి గాల్లో తేలిపోయింది. సోషల్ మీడియాలో తన అభిమాన గణాన్ని చూసి సంబరపడిపోయింది. ఇక తనకు ఓట్లు వేసిన, ప్రేమించిన అభిమానుల కోసం లైవ్‌లొకి రావడం ముచ్చట్లు పెట్టడం వంటివి చేస్తూనే ఉంది. అయితే తాజాగా అరియానా ో హీరోకు బర్త్ డే విషెస్ చెబుతూ తన మనసులోని మాటలు బయటకు చెప్పేసింది. హ్యాపీ బర్త్ డే నాగశౌర్య గారు అని చెబుతూ.. అతనితో దిగిన ఫోటోను షేర్ చేసింది. అయితే ఇందులోనే నాగ శౌర్య అంటే క్రష్ అనే విషయాన్ని కూడా బయటకు చెప్పేసింది.

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp