Ariyana : అభిమాని అడ‌గ‌డంతో కాద‌న‌లేక‌పోయిన అరియానా.. ప‌ట్ట‌లేని సంతోషంతో…!

Authored By Sam C | The Telugu News | Published on: January 24, 2022, 7:30 pm

Ariyana : అరియానా.. ఈ పేరు ఒక‌ప్పుడు చాలా త‌క్కువ మందికి తెలుసు. రామ్ గోపాల్ వర్మ ఆమె ఫిగర్ గురించి కామెంట్ చేయ‌డంతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. అలా యాంకర్ అరియానా పేరు మార్మోగిపోగా… ఇమేజ్ వచ్చిపడింది. ఇక బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చి తన గడుసు తనంతో… తన చిలిపి తనంతో.. తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు. సెలబ్రిటీగా ఫేమస్‌ అయిపోయింది. మోడల్ గా … యాంక‌ర్‌గా, న‌టిగా ఇలా త‌న‌కు వ‌చ్చిన అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకుంటూ అద‌ర‌గొడుతుంది.బిగ్ బాస్ షో అరియానా కెరీర్ కి బాగానే ఉపయోగపడింది. బయటికి వచ్చాక అరియానాకు మంచి ఆఫర్స్ దక్కాయి. ఇటీవల బిగ్ బాస్ సీజన్ 5 ముగిసింది.

ఇక బిగ్ బాస్ బజ్ షోకి అరియానా యాంకర్ గా వ్యవహరించారు. ఎలిమినేటైన కంటెస్టెంట్స్ ని వరుసగా ఇంటర్వ్యూలు చేశారు. రాహుల్ సింప్లిగంజ్ బాధ్యత అరియానా తీసుకున్నారు. అంద‌రి నుండి ఆస‌క్తిక‌ర ప్ర‌శ్న‌లు అడుగుతూ ఫుల్‌గానే ఎంట‌ర్‌టైన్ చేసింది. ఇక వీలున్న‌ప్పుడ‌ల్లా మెహబూబ్, సోహెల్‌లతో కలిసి అరియానా రీల్ వీడియోలు చేస్తుంటుంది. రీసెంట్‌గా ఓ రీల్ వీడియోను షేర్ చేసింది. దానిపై ఓ నెటిజన్ స్పందించింది.అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే అరియానా గ్లోరీ, నేను నీకు పెద్ద అభిమానిని. నువ్వే నాకు స్ఫూర్తి.. నాకు మెసెజ్‌కు రిప్లై ఇస్తే నాకు అదే పెద్ద అచ్చీవ్ మెంట్.. అదే నాకు ఎక్కువ..

ariyana glory reacts to the fan desire

ariyana glory reacts to the fan desire

Ariyana : ఫ్యాన్స్ అడ‌గ‌డం, అరియానా కాద‌న‌డ‌మా..!

నాకు రిప్లై ఇవ్వండి ప్లీజ్ అని వేడుకుంది. దీంతో అరియానా స్పందించింది. థ్యాంక్యూ సో మచ్.. టేక్ కేర్ అని రిప్లై పెట్టేసింది. దీంతో అభిమాని ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. ప‌ట్ట‌లేని సంతోషంతో ఉప్పొంగిపోతుంది. కాగా, అరియానా అనుభవించు రాజా సినిమాతో తెరంగేట్రం చేసింది అరియానా. ఆ సినిమా అంతగా వర్కవుట్ కాలేదు. అరియానాకు కూడా అంత మంచి పేరేమీ రాలేదు. దీంతో మంచి సినిమా కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తుంది.

 

View this post on Instagram

 

A post shared by Ariyana Glory (@ariyanaglory)

 

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp