Bigg Boss Telugu 7 : టాస్క్‌లో అశ్వినిని దారుణంగా తోసేసిన అర్జున్.. సడెన్‌గా కిందపడటంతో అశ్వినికి గాయాలు.. హౌస్‌మెట్స్ షాక్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bigg Boss Telugu 7 : టాస్క్‌లో అశ్వినిని దారుణంగా తోసేసిన అర్జున్.. సడెన్‌గా కిందపడటంతో అశ్వినికి గాయాలు.. హౌస్‌మెట్స్ షాక్

 Authored By kranthi | The Telugu News | Updated on :26 October 2023,12:00 pm

ప్రధానాంశాలు:

  •  అర్జున్ ఫెయిర్ గేమ్ ఆడుతున్నాడా.. లేక ఫేక్ గేమా?

  •  బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో రిలీజ్

  •  వచ్చే వారం కెప్టెన్ ఎవరు?

Bigg Boss Telugu 7 : బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. వచ్చే వారం కెప్టెన్సీ టాస్క్ అయితే ఇప్పటి వరకు చాలా ఫన్ గా సాగింది. కానీ.. హౌస్ మెట్స్ కు బిగ్ బాస్ ఎన్నిసార్లు హెచ్చరించినా వాళ్లు వినడం లేదు. టాస్కులలో ఫిజికల్ గా వెళ్లొద్దు అని చాలాసార్లు బిగ్ బాసు హెచ్చరించాడు. కానీ.. వినరు.. టాస్క్ గెలవాలనే ఆతృతలో ఒకరిని మరొకరు తోచుకుంటూ ఉంటారు. ఇప్పటి వరకు చాలాసార్లు అలా జరిగింది. టాస్క్ గెలవడం ముఖ్యమే కానీ.. ఎవరిపైన అయినా ఫిజికల్ గా వెళ్తే వాళ్లకు ఏమైనా అయితే ఎవరు బాధ్యత తీసుకుంటారు. ఒక్కోసారి ఎవరు ఏం చేయకున్నా.. టాస్కుల్లో గాయాలవుతుంటాయి. శివాజీకి అలాగే గాయం అయింది. ఇప్పుడు ఫిజికల్ గా శివాజీ ఆడలేకపోతున్నాడు. ఇదంతా పక్కన పెడితే వచ్చే వారం కెప్టెన్సీ టాస్క్ కోసం బిగ్ బాస్ ఇప్పటికే మూడు టాస్కులు పెట్టాడు. మొదటి టాస్కులో ప్రియాంక కంటెండర్ అవగా.. రెండో టాస్క్ లో ప్రశాంత్ కంటెండర్ అయ్యాడు. మూడో టాస్కులో సందీప్, అర్జున్, అశ్విని, భోలే.. ఈ నలుగురు బరిలోకి దిగారు.

తమ తల మీద ఉన్న స్పాంజీ మీద షవర్ వేస్తారు. నీళ్లు దాని మీద ఇంకేలా చూసుకొని పక్కనే ఉన్న గ్లాస్ బాటిల్ లో పిండాలి. ఎవరు ఎక్కువ పిండితే వాళ్లే కెప్టెన్సీ కంటెండర్ అవుతారు అని బిగ్ బాస్ చెబుతాడు. షవర్ ఒక్కటే ఉండటంతో నలుగురు ఒకరిని మరొకరు తోసుకుంటూ స్పాంజీ మీద నీళ్లు పడేలా చేస్తారు. అయితే.. అందరూ ఒకేసారి వెళ్లడం వల్ల.. అందరి తల మీద నీళ్లు పడక.. ఒకరిని మరొకరు తోసుకోవడం ఎక్కువైపోయింది. అర్జున్, సందీప్, బోలే ముగ్గురు స్ట్రాంగ్. కానీ.. అశ్విని అమ్మాయి కావడంతో తన మీద నీళ్లు పడనీయరు. దీంతో తను కూడా స్ట్రాంగ్ అని నిరూపించుకోవాలని షవర్ దగ్గరికి వెళ్తుంది. కానీ.. అర్జున్ మాత్రం ఎవ్వరినీ అక్కడికి రానివ్వడు. అందరినీ నెట్టేస్తాడు. కనీసం అమ్మాయి అని కూడా చూడకుండా అశ్వినిని అర్జున్ నెట్టేయడంతో అక్కడున్న వాళ్లంతా షాక్ అవుతారు. అర్జున్ అలా అశ్వినిని నెట్టేయడంతో తను కిందపడుతుంది. వెంటనే శివాజీ వచ్చి తనను లేపుతాడు.

Bigg Boss Telugu 7 : అర్జున్ పై మండిపడ్డ హౌస్ మెట్స్

అర్జున్ పై ఇతర హౌస్ మెట్స్ అందరూ మండిపడ్డారు. నన్ను కూడా చాలాసార్లు తోశాడు. పీక పట్టుకొని తోశాడు అర్జున్ అని సందీప్ మాస్టర్.. తేజ, అమర్ తో చెబుతాడు. ఆ పిల్లను ఒక తోపు తోస్తే కింద పడిపోయింది అని చెబుతాడు. స్టోర్ ఇట్.. పోర్ ఇట్ అనే ఈ టాస్కులో ఎవరు గెలిచారు అనేది తెలియదు కానీ.. అశ్వినిని అర్జున్ తోయడం మాత్రం జనాలకు కూడా నచ్చలేదు. ఎంత బలం ఉంటే మాత్రం ఆడపిల్లలపై అలా ప్రతాపం చూపిస్తారా అంటూ మండిపడుతున్నారు. ఈ ఘటనపై వీకెండ్ లో నాగార్జున ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

YouTube video

Advertisement
WhatsApp Group Join Now

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది