Devatha serial : మరీ నాటుగా ఉన్నాడే!.. భార్యను పక్కన పెట్టుకుని దేవత సీరియల్ హీరో రచ్చ
Devatha serial : బుల్లితెరపై వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి సుమ క్యాష్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి శనివారం ఈ కార్యక్రమానికి పలువురు సెలబ్రిటీలు హాజరవుతూ ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని అందిస్తారు. ఈ క్రమంలోనే శనివారం స్పెషల్ ఎపిసోడ్‌లో దేవత సీరియల్ హీరో అర్జున్ అతని భార్య సురేఖ, శివ జ్యోతి – గంగోలి, లాస్య- మంజునాథ్,రోహిత్-మెరీనా హాజరయ్యారు. ఇక ఈ నాలుగు జంటలు సుమతో కలిసి సందడి సందడిగా ఈ కార్యక్రమంలో ఎంజాయ్ చేసినట్లు ప్రోమో ద్వారా తెలుస్తోంది.
ఇక మొదటగా వేదికపైకి దేవత సీరియల్ హీరో అర్జున్, సురేఖ దంపతులు ఆహ్వానించింది. అర్జున్ ను ఉద్దేశించి సుమ మీరు భార్య చాటు భర్త నా లేక తొడ కొట్టే భర్త అని ప్రశ్నించగా అతను ఏకంగా భార్య తొడగొట్టే భర్త అంటూ సమాధానం చెప్పి అందరినీ షాక్ కి గురి చేశారు. అదే విధంగా ఈ ప్రోమోలో భాగంగా పొదల చాటు ప్రేమ వ్యవహారం నడిపే జంటలుగా నటించారు. ఇందులో ముందుగా శివ జ్యోతి గంగూలి వెళ్లగా వారు కాస్త తడబడగా దేవత సీరియల్ హీరో అర్జున్ స్పందిస్తూ.. ఏ.. ఏం చేస్తున్నారా ఈ కాలం జనరేషన్ ఇలా ఉన్నారు అంటూ తను రంగంలోకి దిగాడు.

Devatha serial Arjun over action in suma cash program
Devatha serial : క్యాష్ ప్రోగ్రాంలో రచ్చ చేసిన దేవత సీరియల్ హీరో అర్జున్:
ఎవరైనా ఉన్నారా.. ఆ నువ్వు ఉన్నావు కదా అంటూ తన భార్యను దగ్గరకు తీసుకోగా.. తను ఉండగా మరొకరిని పిలుస్తున్నారు అంటూ సురేఖ తన భర్తను సరదాగా కొట్టబోతుంది. ఇలా తన భార్య పక్కన ఉండగానే అర్జున్ మాత్రం ఏమాత్రం తగ్గకుండా ఈ కార్యక్రమంలో రచ్చ చేశారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో వైరల్ గా మారింది. ఇక పూర్తి ఎపిసోడ్ చూడాలంటే జనవరి ఒకటవ తేదీ వరకు వేచి చూడాలి.
