
Arohi rao And RJ Surya Bond in Bigg Boss 6 Telugu
Bigg Boss 6 Telugu : కొందరు బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చాక స్నేహితులు అవుతారు. కొన్ని సార్లు బయట స్నేహితులుగా ఉన్న వాళ్లే బిగ్ బాస్ ఇంట్లో కంటెస్టెంట్లుగా వస్తారు. అలా ఈ సారి ఆరో సీజన్‌లో ఆరోహి, ఆర్జే సూర్య కూడా అలానే వచ్చారు. ఈ ఇద్దరూ గత మూడేళ్లుగా స్నేహితులే. టీవీ 9 ఇస్మార్ట్ న్యూస్ షోలో ఈ ఇద్దరూ కలిసి చేస్తున్నారు. కొండబాబుగా సూర్య.. ఇస్మార్ట్ అంజలిగా ఆరోహి అలరిస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ ఇద్దరూ కూడా బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చారు. బయట ఈ ఇద్దరూ కొలీగ్స్ కావొచ్చు స్నేహితులు కావొచ్చు. కానీ బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చాక కంటెస్టెంట్లు. కంటెస్టెంట్ల మాదిరిగానే ఆటలు ఆడతారా? లేదా?
అదే స్నేహాన్ని కంటిన్యూ చేసుకుంటారా? అన్నది వారిష్టం. కానీ తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో ఆరోహి సూర్యల బంధం మీద అందరికీ ఓ క్లారిటీ వచ్చేలా ఉంది. సండే నాడు జరిగిన ఎపిసోడ్‌లో ఆరోహి మీద కాస్త కంప్లైంట్ లాంటిది చేశాడు సూర్య. దీంతో ఆరోహి హర్ట్ అయింది. నువ్వు కూడా ఓ కంటెస్టెంటే, ప్లేయరే అని అర్థమైంది అంటూ సూర్య గురించి ఆరోహి అనేసింది. ఈ మాటలతో ఈ ఇద్దరి మధ్య కాస్త గ్యాప్ వచ్చింది. దీంతో సూర్య మైక్‌ను ఆరోహి దాచేసింది. ఇనయ మైక్‌ను తనదిగా భావించి సూర్య ధరించేశాడు. చివరకు ఇనయ మైక్ అనితెలిసి ఆమెకు ఇచ్చాడు.
Arohi rao And RJ Surya Bond in Bigg Boss 6 Telugu
తన మైక్ ఆరోహి దాచేసిందని తెలిసినా కూడా సూర్య అడగలేదు. సూర్య అడగటం లేదని ఆరోహి కూడా వదిలేసింది. అయితే ఈ ఇద్దరి మధ్య మాటలు తగ్గాయి. చివరకు ఈ ఇద్దరూ మాట్లాడుకున్నారు. ఫన్నీగా పోట్లాడుకున్నారు. చివరకు ఒక్కటయ్యారు. సారీ చెప్పమంటూ ఆరోహి కాస్త బెట్టు చేసింది. ఏడ్చింది. చివరకు సూర్య.. ఐ యామ్ సారీ.. ఐ లవ్యూ అని కూడా చెప్పేశాడు. అలా ఆరోహి కాస్త శాంతించింది. ఆ తరువాత చక్కఃగా హత్తుకున్నారు. మొత్తానికి ఆరోహి సూర్య బంధం ఎప్పటికీ ఇలానే ఉంటుందా? ఇంకాస్త ముందుకు వెళ్తుందా? అన్నది బిగ్ బాస్ ఇంట్లో కాలమే చెప్పాలి. అక్కడ ఎప్పుడూ ఒకే పరిస్థితులు ఉండవని అందరికీ తెలిసిన విషయమే.
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
This website uses cookies.