Bigg Boss 6 Telugu : ఆరోహికి ఐ లవ్యూ చెప్పిన సూర్య.. బంధం బలపడుతోందా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Bigg Boss 6 Telugu : ఆరోహికి ఐ లవ్యూ చెప్పిన సూర్య.. బంధం బలపడుతోందా?

Bigg Boss 6 Telugu : కొందరు బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చాక స్నేహితులు అవుతారు. కొన్ని సార్లు బయట స్నేహితులుగా ఉన్న వాళ్లే బిగ్ బాస్ ఇంట్లో కంటెస్టెంట్లుగా వస్తారు. అలా ఈ సారి ఆరో సీజన్‌లో ఆరోహి, ఆర్జే సూర్య కూడా అలానే వచ్చారు. ఈ ఇద్దరూ గత మూడేళ్లుగా స్నేహితులే. టీవీ 9 ఇస్మార్ట్ న్యూస్ షోలో ఈ ఇద్దరూ కలిసి చేస్తున్నారు. కొండబాబుగా సూర్య.. ఇస్మార్ట్ అంజలిగా ఆరోహి అలరిస్తూనే ఉన్నారు. […]

 Authored By prabhas | The Telugu News | Updated on :13 September 2022,7:30 pm

Bigg Boss 6 Telugu : కొందరు బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చాక స్నేహితులు అవుతారు. కొన్ని సార్లు బయట స్నేహితులుగా ఉన్న వాళ్లే బిగ్ బాస్ ఇంట్లో కంటెస్టెంట్లుగా వస్తారు. అలా ఈ సారి ఆరో సీజన్‌లో ఆరోహి, ఆర్జే సూర్య కూడా అలానే వచ్చారు. ఈ ఇద్దరూ గత మూడేళ్లుగా స్నేహితులే. టీవీ 9 ఇస్మార్ట్ న్యూస్ షోలో ఈ ఇద్దరూ కలిసి చేస్తున్నారు. కొండబాబుగా సూర్య.. ఇస్మార్ట్ అంజలిగా ఆరోహి అలరిస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ ఇద్దరూ కూడా బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చారు. బయట ఈ ఇద్దరూ కొలీగ్స్ కావొచ్చు స్నేహితులు కావొచ్చు. కానీ బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చాక కంటెస్టెంట్లు. కంటెస్టెంట్ల మాదిరిగానే ఆటలు ఆడతారా? లేదా?

అదే స్నేహాన్ని కంటిన్యూ చేసుకుంటారా? అన్నది వారిష్టం. కానీ తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో ఆరోహి సూర్యల బంధం మీద అందరికీ ఓ క్లారిటీ వచ్చేలా ఉంది. సండే నాడు జరిగిన ఎపిసోడ్‌లో ఆరోహి మీద కాస్త కంప్లైంట్ లాంటిది చేశాడు సూర్య. దీంతో ఆరోహి హర్ట్ అయింది. నువ్వు కూడా ఓ కంటెస్టెంటే, ప్లేయరే అని అర్థమైంది అంటూ సూర్య గురించి ఆరోహి అనేసింది. ఈ మాటలతో ఈ ఇద్దరి మధ్య కాస్త గ్యాప్ వచ్చింది. దీంతో సూర్య మైక్‌ను ఆరోహి దాచేసింది. ఇనయ మైక్‌ను తనదిగా భావించి సూర్య ధరించేశాడు. చివరకు ఇనయ మైక్ అనితెలిసి ఆమెకు ఇచ్చాడు.

Arohi rao And RJ Surya Bond in Bigg Boss 6 Telugu

Arohi rao And RJ Surya Bond in Bigg Boss 6 Telugu

తన మైక్ ఆరోహి దాచేసిందని తెలిసినా కూడా సూర్య అడగలేదు. సూర్య అడగటం లేదని ఆరోహి కూడా వదిలేసింది. అయితే ఈ ఇద్దరి మధ్య మాటలు తగ్గాయి. చివరకు ఈ ఇద్దరూ మాట్లాడుకున్నారు. ఫన్నీగా పోట్లాడుకున్నారు. చివరకు ఒక్కటయ్యారు. సారీ చెప్పమంటూ ఆరోహి కాస్త బెట్టు చేసింది. ఏడ్చింది. చివరకు సూర్య.. ఐ యామ్ సారీ.. ఐ లవ్యూ అని కూడా చెప్పేశాడు. అలా ఆరోహి కాస్త శాంతించింది. ఆ తరువాత చక్కఃగా హత్తుకున్నారు. మొత్తానికి ఆరోహి సూర్య బంధం ఎప్పటికీ ఇలానే ఉంటుందా? ఇంకాస్త ముందుకు వెళ్తుందా? అన్నది బిగ్ బాస్ ఇంట్లో కాలమే చెప్పాలి. అక్కడ ఎప్పుడూ ఒకే పరిస్థితులు ఉండవని అందరికీ తెలిసిన విషయమే.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది