Comedian Naresh Satires on Hyper aadi in Jabardasth Promo
Hyper Aadi : హైపర్ ఆది పెళ్లి గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్త హైలెట్ అవుతూనే ఉంటుంది. ఆయన ప్రేమలో ఉన్నాడని, లవర్ ఉందని ఒకసారి రూమర్ వస్తుంది. బంధువుల అమ్మాయిని చేసుకుంటాడని, పెద్దలు కుదిర్చిన పెళ్లి అని ఇంకొందరు అంటారు. అలా ఆది పెళ్లి మీద ఏదో ఒక చర్చ నడుస్తూనే అంటుంది. ఒకప్పుడు అయితే వర్షిణి ఆది ప్రేమ, పెళ్లికి సంబంధించిన రూమర్లు చక్కర్లు కొట్టాయి. ఢీ షోలో కలిసి చేయడం ద్వారా వీరిద్దరి ట్రాక్ బాగా సెట్ అయింది. ఇక ఆది మీద వర్షిణి వేసే పోస్టులు కూడా అనుమానాలకు దారి తీస్తుంటుంది.
అయితే కరోనా సమయంలో ఆది పెళ్లి మీద రూమర్లు చాలా గట్టిగా వచ్చాయి. ఈ ఏడాదిలో ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి అవుతుందనే రూమర్లు వచ్చాయి. సమ్మర్‌లో వివాహాం జరుగుతుందని వార్తలు వచ్చాయి. ఆది కూడా ఈ ఏడాది పెళ్లి చేసుకుంటానని చెప్పుకొచ్చాడు. కానీ ఇంత వరకు మళ్లీ ఆ ఊసే లేకుండా పోయింది. స్కూల్ ఏజ్‌లోని తన బ్రేకప్ స్టోరీని చెబుతూ అందరినీ కదిలించేశాడు ఆది. అయితే ఆది ఇప్పుడు పెళ్లికి సిద్దంగానే ఉన్నట్టు కనిపిస్తోంది. కానీ పెళ్లి ఎప్పుడు అవుతుందన్నది మాత్రం చెప్పడం లేదు. తాజాగా వదిలిన ఓ ప్రోమోలో ఆది పెళ్లి మీద నరేష్ కౌంటర్లు వేశాడు.జబర్దస్త్ ప్రోమోలో ఆది పెళ్లి మీద నరేష్ సెటైర్లు వేశాడు.
Comedian Naresh Satires on Hyper aadi in Jabardasth Promo
నువ్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటావ్ అని నరేష్ అడిగాడు. దానికి ఆది లైట్ తీసుకుంటూ.. అవ్వాలిరా అని అనేస్తాడు. ఏం అవ్వాలి.. ఎక్కడ అవ్వాలి.. సేల్స్ మెన్‌కు కూడా ఓ టార్గెట్ ఉంటుంది.. నీ టార్గెట్ ఎంత చెప్పరా అరేయ్ అంటూ నరేష్ రెచ్చిపోయాడు. కానీ ఆది మాత్రం అలా సైలెంట్‌గా టాపిక్ డైవర్ట్ చేసేశాడు. మరి ఆది పెళ్లి ఎప్పుడు ఉంటుందని ఎవ్వరికీ తెలియడం లేదు. కానీ ఆది మాత్రం ఇప్పుడు బాగానే వెనకేసుకుంటున్నాడు. ఊర్లో పొలాలు, ఆస్తులు, ఇళ్లు కట్టించేశాడు. హైద్రాబాద్‌లోనూ ఆది ఇళ్లు కట్టించినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా ఆది పెళ్లి టాపిక్ మాత్రం ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉంటుంది. మరి అతని పెళ్లి ఎప్పుడు అవుతుందో చూడాలి.
Tribanadhari Barbarik : వెర్సటైల్ యాక్టర్ సత్య రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. కొత్త పాయింట్,…
MLC Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి తన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనానికి దారి తీసింది. తాజాగా…
It Professionals Faces: ప్రస్తుతం భారతదేశంలో టేక్కు పరిశ్రమలలో ఒక భయానక ఆందోళనలు పెరిగాయి. టెక్ కంపెనీలలో పనిచేసే యువకుల్లో…
White Onion : సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా ఉల్లిపాయలు అనగా మొదట గుర్తించేది ఎరుపు రంగును కలిగిన ఉల్లిపాయలు.…
Super Seeds : ప్రకృతి ప్రసాదించిన కొన్ని ఔషధాలలో చియా విత్తనాలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. జ్యూస్ లేదా…
German Firm Offer : శాస్త్రాలు ఏమంటున్నాయి.. చనిపోయిన వారు మళ్ళీ బ్రతుకుతారా, సారి మనిషి చనిపోతే తిరిగి మరలా…
Raksha Bandhan : రాఖీ పండుగ వచ్చింది తమ సోదరులకి సోదరీమణులు ఎంతో ఖరీదు చేసే రాఖీలను కొని, కట్టి…
Pooja Things: శ్రావణమాసం వచ్చింది. అనేక రకాలుగా ఆధ్యాత్మికతో భక్తులు నిండి ఉంటారు. ఈ సమయంలో అనేకరకాల పూజలు, వ్రతాలు,…
This website uses cookies.