Home » Entertainment » Artist Sureskha Vani Supritha Funny Video
Entertainment

ఫ్రెష్ గొట్టాలు ఆల్ టైం ఫేవరేట్.. సురేఖా వాణి వీడియో వైరల్

Authored By
Admin
The Telugu News | Published on: December 11, 2020, 12:59 pm
Advertisement

సురేఖా వాణి సోషల్ మీడియలో చేసే రచ్చ అందరికీ తెలిసిందే. తన కూతురు సుప్రితతో కలిసి సురేఖా వాణి సోషల్ మీడియాను ఊపేస్తూ ఉంటుంది. ఒకప్పుడు టిక్ టాక్‌తో నెటిజన్లను కట్టిపడేసిన సురేఖా వాణి.. ఇప్పుడు హాట్ హాట్ ఫోటోలతో రచ్చ చేస్తోంది. అన్ లాక్ ప్రక్రియ మొదలైన క్షణం నుంచి సురేఖా వాణి తిరుగుతూనే ఉంది. కూతురితో కలిసి చక్కర్లు కొడుతూ నానా రచ్చ చేస్తోంది. ఓ వైపు సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉంటూనే వెకేషన్లలో రచ్చ చేస్తోంది.

Advertisement

Artist Sureskha Vani Supritha Funny Video

ఆ మధ్య తల్లీ కూతుళ్లిద్దరూ గోవాలో చేసిన సందడి అంతా ఇంతా కాదు. కూతురి కంటే ఎక్కువ హాట్‌గా రెడీ అయినా సురేఖా వాణి ఫోటోలను చూసి అందరూ షాక్ అయ్యారు. అలా చేతిలో మందు గ్లాసును పట్టుకుని బీచ్‌లో నడుస్తోన్న సురేఖా వాణిని చూసి అందరూ ఫిదా అయ్యారు. కూతురితో కలిసి పబ్‌, బీచ్‌లంటూ నానా హంగామా చేస్తోన్న సురేఖా వాణి తాజాగా ఓ ఫన్నీ కామెంట్లు చేసింది. తాజాగా సురేఖా వాణి తన కూతురితో కలిసి బయటకు వెళ్లినట్టు కనిపిస్తోంది.

Advertisement

చిన్నప్పుడు గొట్టాలు (పాపుడాలు) అందరూ తినే ఉంటారు. చేతికి ఉన్న ఐదు వేళ్లకు వాటిని పెట్టుకుని తింటూ సంబరపడేవారు. వాటిని తాజాగా సురేఖా వాణి కుప్పలు తెప్పలుగా కొనుక్కుంది. అవన్నీ ఎందుకు కొన్నావ్.. నువ్వొక్క దానివే అవన్నీ తింటావా? అయినా అవి తినడం ఏంటని సుప్రిత సురేఖను ప్రశ్నించింది. మనం ఏ కారులో ఉన్నా స్టేటస్‌లో ఉన్నా కూడా టేస్ట్‌లు మారకూడదు… ఈ గొట్టాలు ఎప్పటికీ నా ఫేవరేంట్ అంటూ సురేఖా వాణి చెప్పుకొచ్చింది.

Admin

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి