Ashu Reddy అలాంటి మెసెజ్‌లతో టెంప్ట్ చేస్తున్నారు : అషూ రెడ్డి
Ashu Reddy అషూ రెడ్డి బుల్లితెర మీద మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది. డబ్ స్మాష్ అనే యాప్‌తో ఈ భామ ఎక్కువగా ఫేమస్ అయింది. జూనియర్ సమంత అనే పేరును తెచ్చుకుంది. ఆ డబ్ స్మాష్‌లో వీడియోలు చేసిన తరువాత బాగానే పాపులర్ అయింది. అలా ఆమెకు సినిమా అవకాశం కూడా వచ్చింది. ఛల్ మోహనరంగ అనే సినిమాలో అషూ నటించింది. అలా మొత్తానికి ఓ మోస్తరుగా వెలుగులోకి వచ్చింది. బిగ్ బాస్ షోతో అషూ రెడ్డి మరింతగా ఫేమస్ అయింది.

Ashu Reddy ABout Her Favourite Food
మధ్యలో బ్రేకప్ వల్ల, డిప్రెషన్‌కు గురవ్వడంతో అషూ రెడ్డి శారీరకంగా ఎంతో మార్పు చెందింది. అయితే ఒకప్పుడు జీరో సైజులో ఉన్న అషూ రెడ్డి ఇప్పుడు లావుగా మారింది. బిగ్ బాస్ షోకు ఇప్పటికీ చాలా మారింది. వర్కవుట్లు చేసిందో, డైట్ ఫాలో అయిందో తెలియదు గానీ మొత్తానికి అషూ మాత్రం ఇప్పుడు కాస్త సన్నబడింది. అయినా కూడా అషూ బొద్దుగానే కనిపిస్తుంది. దానికి తగ్గట్టుగా ఆమె తొడ అందాలను ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉంటుంది.
Ashu Reddy మెసెజ్‌లతో అషూ రచ్చ..

Ashu Reddy ABout Her Favourite Food
అసలే అషూ రెడ్డి భోజనప్రియురాలు. ఎక్కువగా తినడం ఇష్టం. అలాంటి అషూ రెడ్డి డైట్ చేయడం అంటే ఎంత కష్టం. అయినా కూడా ఎంతో కష్టపడి డైట్ చేస్తుంటే కొన్ని మెసెజ్‌లు మాత్రం టెంప్ట్ చేస్తున్నాయట. ఈ మధ్య ఓలా నుంచి కొన్ని సందేశాలు వస్తున్నాయి. మనకు ఏ ఫుడ్ సరిపోతుందో అని చెప్పి. ఆర్డర్ చేసుకోమని సలహా ఇస్తోంది. అలానే అషూకి బిర్యానీకి జోడి కుదిరింది.. వెంటనే ఆర్డర్ చేసుకోండి అని ఓలా నుంచి మెసెజ్ వచ్చిందట. ఇలా డైట్‌లో ఉన్నప్పుడు ఇలాంటి మెసెజ్‌లు వచ్చి టెంప్ట్ చేస్తున్నాయంటూ అషూ తెగ ఫీలైంది.