ashu reddy enters into bigg boss ott
Ashu Reddy : బిగ్ బాస్ బ్యూటీగా మంచి పేరు ప్రఖ్యాతలు పొందిన అషూ రెడ్డి గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ అమ్మడు ఓటీటీలో కూడా సందడి చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. బిగ్బాస్ మూడో సీజన్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ పరోక్షంగా హింట్ ఇచ్చాడు. అయితే బిగ్బాస్ నాన్స్టాప్ తొలి సీజన్లో అషు రెడ్డి ఎంట్రీ ఇస్తుందని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. కానీ అధికారికంగా ఏ ఒక్క కంటెస్టెంట్ పేరు ప్రకటించలేదు. ‘ఆల్ ది బెస్ట్ అషు.. దేనికి చెప్పానో నువే ఆలోచించుకో’ అంటూ పోస్ట్ చేశాడు రాహుల్.
దీంతో అందరూ అషు రెడ్డి బిగ్బాస్ నాన్స్టాప్లో ఎంట్రీ ఇస్తుందని చర్చించుకుంటున్నారు.ఈ క్రమంలో నేడు అషూ రెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా బిగ్ బాస్ ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు కన్‌ఫాం చేసింది. ఊ అంటావా? మామ అనే పాటకు అదిరిపోయే స్టెప్పులు వేస్తూ ఎంట్రీ ఇచ్చింది అషూ. అయితే అషూ రెడ్డి మాత్రం బిగ్ బాస్ ఇంట్లో ఎలా ఉండనుందో చెప్పుకొచ్చింది. ఈ మధ్య ఇంటర్వ్యూలు ఇస్తున్నావ్ అని నాగార్జున సెటైర్ వేశాడు. వర్మతో చేసిన వింత ఇంటర్వ్యూ గురించి నాగ్ సెటైర్ వేసినట్టు తెలుస్తోంది. బిగ్ బాస్ ఇంట్లో ఏం చేస్తావ్ అని నాగ్ అడిగేశాడు. బిగ్ బాస్ ఇంట్లో అన్నీ చేస్తాను కానీ..
ashu reddy enters into bigg boss ott
ప్రేమ మాత్రం అస్సలు పెట్టుకోను.. అవన్నీ చాలా చూశాను.. ఇక చాలు అని అషూ తెలిపింది.ఇక ఇంట్లోకి మొదటి కంటెస్టెంటుగా వచ్చాను..అలానే చివరన వెళ్లేట్టు చేయమని కోరింది. ఇంట్లో పిచ్చెక్కిస్తా, కొత్త అషూ రెడ్డిని చూస్తారు.. నా ఆట ఏంటో చూపిస్తానంటూ చెప్పుకొచ్చింది అషూ రెడ్డి. ఈ అమ్మడికి అందరు ఆల్‌ది బెస్ట్ చెబుతున్నారు. తప్పకుండా ట్రోఫీ అందుకొని రావాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం అషూ రెడ్డికి కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్ ముషీరాబాద్‌లో ఓ రెస్టారెంట్‌లో చోటుచేసుకున్న…
Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…
UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…
Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…
Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…
Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…
I Phone 17 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ మోడల్ ఐఫోన్ 17ను తాజాగా…
Dizziness causes symptoms | చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…
This website uses cookies.