Ashu Reddy : బిగ్ బాస్ ఓటీటీ ఎంట్రీ క‌న్‌ఫాం చేసిన అషూ రెడ్డి.. ఇక ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అట‌..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Ashu Reddy : బిగ్ బాస్ ఓటీటీ ఎంట్రీ క‌న్‌ఫాం చేసిన అషూ రెడ్డి.. ఇక ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అట‌..!

Ashu Reddy : బిగ్ బాస్ బ్యూటీగా మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు పొందిన అషూ రెడ్డి గ‌త కొద్ది రోజులుగా సోష‌ల్ మీడియాలో తెగ సంద‌డి చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ అమ్మ‌డు ఓటీటీలో కూడా సంద‌డి చేయ‌నున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. బిగ్​బాస్​ మూడో సీజన్ విన్నర్​ రాహుల్​ సిప్లిగంజ్​ పరోక్షంగా హింట్​ ఇచ్చాడు. అయితే బిగ్​బాస్​ నాన్​స్టాప్​ తొలి సీజన్​లో అషు రెడ్డి ఎంట్రీ ఇస్తుందని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. కానీ అధికారికంగా ఏ […]

 Authored By sandeep | The Telugu News | Updated on :26 February 2022,9:00 pm

Ashu Reddy : బిగ్ బాస్ బ్యూటీగా మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు పొందిన అషూ రెడ్డి గ‌త కొద్ది రోజులుగా సోష‌ల్ మీడియాలో తెగ సంద‌డి చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ అమ్మ‌డు ఓటీటీలో కూడా సంద‌డి చేయ‌నున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. బిగ్​బాస్​ మూడో సీజన్ విన్నర్​ రాహుల్​ సిప్లిగంజ్​ పరోక్షంగా హింట్​ ఇచ్చాడు. అయితే బిగ్​బాస్​ నాన్​స్టాప్​ తొలి సీజన్​లో అషు రెడ్డి ఎంట్రీ ఇస్తుందని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. కానీ అధికారికంగా ఏ ఒక్క కంటెస్టెంట్​ పేరు ప్రకటించలేదు. ‘ఆల్​ ది బెస్ట్​ అషు.. దేనికి చెప్పానో నువే ఆలోచించుకో’ అంటూ పోస్ట్​ చేశాడు రాహుల్.

దీంతో అందరూ అషు రెడ్డి బిగ్​బాస్​ నాన్​స్టాప్​లో ఎంట్రీ ఇస్తుందని చర్చించుకుంటున్నారు.ఈ క్ర‌మంలో నేడు అషూ రెడ్డి త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా బిగ్ బాస్ ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్నట్టు క‌న్‌ఫాం చేసింది. ఊ అంటావా? మామ అనే పాటకు అదిరిపోయే స్టెప్పులు వేస్తూ ఎంట్రీ ఇచ్చింది అషూ. అయితే అషూ రెడ్డి మాత్రం బిగ్ బాస్ ఇంట్లో ఎలా ఉండనుందో చెప్పుకొచ్చింది. ఈ మధ్య ఇంటర్వ్యూలు ఇస్తున్నావ్ అని నాగార్జున సెటైర్ వేశాడు. వర్మతో చేసిన వింత ఇంటర్వ్యూ గురించి నాగ్ సెటైర్ వేసినట్టు తెలుస్తోంది. బిగ్ బాస్ ఇంట్లో ఏం చేస్తావ్ అని నాగ్ అడిగేశాడు. బిగ్ బాస్ ఇంట్లో అన్నీ చేస్తాను కానీ..

ashu reddy enters into bigg boss ott

ashu reddy enters into bigg boss ott

Ashu Reddy : అషూ రెడ్డి ర‌చ్చ నేటి నుండి స్టార్ట్..

ప్రేమ మాత్రం అస్సలు పెట్టుకోను.. అవన్నీ చాలా చూశాను.. ఇక చాలు అని అషూ తెలిపింది.ఇక ఇంట్లోకి మొదటి కంటెస్టెంటుగా వచ్చాను..అలానే చివరన వెళ్లేట్టు చేయమని కోరింది. ఇంట్లో పిచ్చెక్కిస్తా, కొత్త అషూ రెడ్డిని చూస్తారు.. నా ఆట ఏంటో చూపిస్తానంటూ చెప్పుకొచ్చింది అషూ రెడ్డి. ఈ అమ్మ‌డికి అంద‌రు ఆల్‌ది బెస్ట్ చెబుతున్నారు. త‌ప్ప‌కుండా ట్రోఫీ అందుకొని రావాల‌ని సూచిస్తున్నారు. ప్ర‌స్తుతం అషూ రెడ్డికి కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Ashu Reddy (@ashu_uuu)

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది