Ashu Reddy : ఇదెక్క‌డి చెండాలం.. అరియానా న‌డుముపై ముద్దు పెట్టిన అషూ రెడ్డి

Authored By Sam C | The Telugu News | Published on: February 2, 2022, 1:00 pm

Ashu Reddy : బిగ్ బాస్ బ్యూటీస్ అరియానా, అషూ రెడ్డి గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఒకరు ఆర్జీవీతో పాపుల‌ర్ కాగా, మ‌రొక‌రు స‌మంత పోలిక‌ల‌తో ఉండడంతో వార్త‌ల‌లో నిలిచారు. ఈ ఇద్ద‌రు ముద్దుగుమ్మ‌లు బిగ్ బాస్ లో సంద‌డి చేయ‌డ‌మే కాకుండా ఆర్జీవీతో క‌లిసి హాట్ షోతో తెగ ర‌చ్చ చేశారు. అయితే ఇప్పుడు అరియానా న‌డుముపై అషూ రెడ్డి ముద్దు పెట్ట‌డం చ‌ర్చనీయాంశంగా మారింది. ఇద్ద‌రూ క‌లిసి ఏదో పాట‌కు పెర్ఫామ్ చేసిన‌ట్లు ఉన్నారు.ఆ పాట‌లో అరియానా న‌డుముని ఆషు రెడ్డి కిస్ చేస్తుంది. అరియానా ఏమో సిగ్గు ప‌డిపోతుందా. ఆ ఫొటోను ఆషు త‌న ఇన్‌స్టాలో షేర్ చేసింది.

అంతే కాదండోయ్ అనంత‌మైన హ‌వభావం (ఇన్‌ఫినిటీ ఎక్స్‌ప్రెష‌న్‌) అని ఆషు రెడ్ది ఫొటోతో పాటు కామెంట్ కూడా పోస్ట్ చేసింది.అషూ రెడ్డి పోస్ట్ చూసిన నెటిజ‌న్స్ తిట్ట‌రాని తిట్లు తిడుతున్నారు. ‘ఏందిరా ఈ చండాలము, ఈ పోస్ట్‌ వల్ల ఉపయోగం ఏంటో ఎవరైనా చెప్తారా?’, ‘ఏదో తేడాగా ఉందే’, ‘ఈ ఫొటో ఆర్జీవీ కానీ చూడాలి’, ‘లెస్బియన్స్‌ అంటే వినడమే తప్ప చూడలే అనుకున్నా, కానీ ఇప్పుడు చూసేశా’, ‘ఇది చాలా టూమచ్‌’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇది చూసిన అరియానా.. ‘ఒసేయ్‌ అషూ నీకు, నీ క్రేజీనెస్‌కి దండమే తల్లి. పాపం అందరూ తప్పుగా అనుకుంటున్నారే, జడ్జిమెంటల్‌ అవుతున్నాం’ అని ఆందోళనతో కామెంట్‌ చేసింది.

Ashu Reddy kissing Ariana On the waist

Ashu Reddy kissing Ariana On the waist

Ashu Reddy : మీ క్రియేటివిటీ మ‌రింత చెండాలంగా ఉందిగా..!

త‌మ‌పై వ‌స్తున్న కామెంట్స్ కి అషూ స్పందిస్తూ.. ‘మంచైనా, చెడైనా ప్రజలెప్పుడూ జడ్జ్‌ చేస్తూనే ఉంటారు. అలా అని మన క్రేజీనెస్‌ని వదిలేయకూడదు. ఎందుకంటే అదే మనల్ని ఇతరుల కన్నా ప్రత్యేకంగా చూపిస్తుంది. ఈ విషయం నేను ఆర్జీవీ నుంచే నేర్చుకున్నా’ అని రిప్లై ఇచ్చింది. అస‌లు ఆషు రెడ్డి అలా అరియానా న‌డుమును ఎందుకు కిస్ చేసింది? అనేది తెలియాలంటే స‌ద‌రు ప్రోగ్రామ్ వ‌చ్చే వ‌ర‌కు ఆగాలి. లేదా.. వాళ్లిద్ద‌రిలో ఒక‌రు రియాక్ట్ కావాలి.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp