ashu reddy smokes cigarette
Ashu Reddy : బిగ్ బాస్ నాన్‌స్టాప్ షో ఆసక్తికరంగా సాగుతున్న విషయం తెలిసిందే. ఇందులో అషురెడ్డి చేస్తున్న హంగామా మాములుగా లేదు.. అతి చేష్టలు ప్రేక్షకులకే కాదు ఆమె తల్లికి కూడా చిరాకుపుట్టించనట్టు ఉన్నాయి. ఆమె ఏకంగా చీపురు పట్టుకుని బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టింది. ‘ఏం చేయడానికి వచ్చావ్ ఇక్కడికి.. గేమ్ ఆడటానికి వచ్చావా? ఎమోషన్స్ పెంచుకోవడానికి వచ్చావా? దేని కోసం వచ్చావు..? అని చీపురు పట్టుకుని నిలదీసింది. దీంతో అషురెడ్డి.. ‘చీపురు ఎందుకు తెచ్చావ్ మమ్మీ.. పరువుపోతుంది’ అంటూ తెగ హంగామా చేసింది.
నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో ఎక్కువగా అమ్మాయిలే కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు అందులోనూ బ్యూటీలు చాలా మందే ఉన్నారు. ఇలా వచ్చిన వారిలో తెలుగు భామ అషు రెడ్డి ఒకరు. గతంలో కంటే ఈ సారి ఆమె మరింత రెచ్చిపోతోంది. తరచూ బూతులు మాట్లాడడం.. హాట్ డ్రెస్‌లతో రచ్చ రచ్చ చేస్తోంది. అలాగే, అఖిల్ సార్థక్‌తో చనువుగా ఉంటూ ట్రాక్ నడుపుతున్నట్లు ఈమె హాట్ టాపిక్ అవుతోంది. తాజాగా బిగ్ బాస్ హౌస్‌లో అషు రెడ్డి స్మోకింగ్ చేసినట్లు ఓ న్యూస్ బయటకు వచ్చింది. అది కూడా బాత్రూంలో చాటుగా కాల్చినట్లు తెలుస్తోంది.అషు రెడ్డితో అఖిల్ సార్థక్ మాట్లాడిన మాటలు అనుమానాలు రేకెత్తించాయి.
ashu reddy smokes cigarette
ఆమెకు క్లోజ్‌గా వచ్చిన అతడు వాసన వస్తుందని అన్నాడు. అంతేకాదు, ‘పెర్ఫూమ్ కొట్టుకో.. అలాగే లోషన్ కూడా రాసుకో. దీనివల్ల నీ నుంచి స్మెల్ రాకుండా ఉంటుంది’ అని సలహాలు ఇచ్చాడు. దీంతో అతడు స్మోకింగ్ గురించే అన్నాడని అంటున్నారు. తర్వాత నటరాజ్ మాస్టర్ బాత్రూం నుంచి బయటకు వచ్చాడు. అక్కడే ఉన్న బాబా భాస్కర్‌తో ‘ఎవరో బాత్రూంలో సిగరెట్ కాల్చారు. అది కూడా అమ్మాయిలే స్మోకింగ్ చేశారు. ఎవరు అనేది తెలీదు కానీ బాగా స్మెల్ వస్తుంది. దాన్ని కవర్ చేయడానికి పెర్ఫూమ్ కొట్టారు. దీంతో బ్యాడ్ స్మెల్ వస్తుంది’ అని లీక్ చేయడంతో దీనిపై క్లారిటీ వచ్చినట్లైంది. ఏదేమైన అషూ రెడ్డి మాముల్ది కాదుగా అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్ ముషీరాబాద్‌లో ఓ రెస్టారెంట్‌లో చోటుచేసుకున్న…
Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…
UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…
Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…
Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…
Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…
I Phone 17 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ మోడల్ ఐఫోన్ 17ను తాజాగా…
Dizziness causes symptoms | చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…
This website uses cookies.