Ashu Reddy : బాత్‌రూంలో సీక్రెట్‌గా సిగ‌రెట్ తాగిన అషూ రెడ్డి.. ఇదేం ఘోరం..!

Authored By Sam C | The Telugu News | Published on: April 30, 2022, 8:00 pm

Ashu Reddy : బిగ్ బాస్ నాన్‌స్టాప్ షో ఆస‌క్తిక‌రంగా సాగుతున్న విష‌యం తెలిసిందే. ఇందులో అషురెడ్డి చేస్తున్న హంగామా మాములుగా లేదు.. అతి చేష్టలు ప్రేక్షకులకే కాదు ఆమె తల్లికి కూడా చిరాకుపుట్టించనట్టు ఉన్నాయి. ఆమె ఏకంగా చీపురు పట్టుకుని బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టింది. ‘ఏం చేయడానికి వచ్చావ్ ఇక్కడికి.. గేమ్ ఆడటానికి వచ్చావా? ఎమోషన్స్ పెంచుకోవడానికి వచ్చావా? దేని కోసం వచ్చావు..? అని చీపురు పట్టుకుని నిలదీసింది. దీంతో అషురెడ్డి.. ‘చీపురు ఎందుకు తెచ్చావ్ మమ్మీ.. పరువుపోతుంది’ అంటూ తెగ హంగామా చేసింది.

నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో ఎక్కువగా అమ్మాయిలే కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు అందులోనూ బ్యూటీలు చాలా మందే ఉన్నారు. ఇలా వచ్చిన వారిలో తెలుగు భామ అషు రెడ్డి ఒకరు. గతంలో కంటే ఈ సారి ఆమె మరింత రెచ్చిపోతోంది. తరచూ బూతులు మాట్లాడడం.. హాట్ డ్రెస్‌లతో రచ్చ రచ్చ చేస్తోంది. అలాగే, అఖిల్ సార్థక్‌తో చనువుగా ఉంటూ ట్రాక్ నడుపుతున్నట్లు ఈమె హాట్ టాపిక్ అవుతోంది. తాజాగా బిగ్ బాస్ హౌస్‌లో అషు రెడ్డి స్మోకింగ్ చేసినట్లు ఓ న్యూస్ బయటకు వచ్చింది. అది కూడా బాత్రూంలో చాటుగా కాల్చినట్లు తెలుస్తోంది.అషు రెడ్డితో అఖిల్ సార్థక్ మాట్లాడిన మాటలు అనుమానాలు రేకెత్తించాయి.

ashu reddy smokes cigarette

ashu reddy smokes cigarette

Ashu Reddy : సిగ‌రెట్ లాగించిందా..!

ఆమెకు క్లోజ్‌గా వచ్చిన అతడు వాసన వస్తుందని అన్నాడు. అంతేకాదు, ‘పెర్ఫూమ్‌ కొట్టుకో.. అలాగే లోషన్ కూడా రాసుకో. దీనివల్ల నీ నుంచి స్మెల్ రాకుండా ఉంటుంది’ అని సలహాలు ఇచ్చాడు. దీంతో అతడు స్మోకింగ్ గురించే అన్నాడని అంటున్నారు. తర్వాత నటరాజ్ మాస్టర్ బాత్రూం నుంచి బయటకు వచ్చాడు. అక్కడే ఉన్న బాబా భాస్కర్‌తో ‘ఎవరో బాత్రూంలో సిగరెట్ కాల్చారు. అది కూడా అమ్మాయిలే స్మోకింగ్ చేశారు. ఎవరు అనేది తెలీదు కానీ బాగా స్మెల్ వస్తుంది. దాన్ని కవర్ చేయడానికి పెర్ఫూమ్ కొట్టారు. దీంతో బ్యాడ్ స్మెల్ వస్తుంది’ అని లీక్ చేయడంతో దీనిపై క్లారిటీ వచ్చినట్లైంది. ఏదేమైన అషూ రెడ్డి మాముల్ది కాదుగా అని నెటిజ‌న్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Sam C

No bio available for this author.

  1. "Vijayasai Reddy : వైజాగ్ స్టీల్ ప్లాంట్ భూముల ఈ-వేలంపై రచ్చ.. వైసీపీ, టీడీపీ మౌనంపై విజయసాయిరెడ్డి సంచలన ఫైర్..!"

  2. "Rahul Gandhi : తెలంగాణ కాంగ్రెస్ ‘ఓటు చోరీ’ సభలో రాహుల్ గాంధీ బిగ్ మిస్టేక్.. పార్టీకి సెల్ఫ్ గోల్ తప్పదా..?"

  3. "Ysrcp : కాకినాడ మేయర్ రేసులో ముద్రగడ క్రాంతి.. కూటమికి చెక్ పెట్టేందుకు వైసీపీ బిగ్ స్కెచ్ ..?"

  4. "Khairatabad By Election : ఖైరతాబాద్ ఉప ఎన్నిక సర్వే.. ఏ పార్టీ లీడ్ లో ఉందంటే..?"

  5. "Naresh : పెళ్లి వద్దన్నా పర్లేదు.. పిల్లల్ని కనండి..! వివాదంపై వీకే నరేశ్ క్లారిటీ..!"

  6. "Employees Bonus : ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఒక్కో ఉద్యోగికి రూ.17,951 బోనస్‌..!"

  7. "Karthika Deepam 2 Today Episode October 15th : జ్యోత్స్న చనిపోయిందా? మృతదేహం దగ్గర అసలు ట్విస్ట్ ఇదే!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp