Nookaraju : నూక‌రాజు ఫోన్‌లో అలాంటి మెసేజ్‌లు.. ల‌వ‌ర్‌కి అడ్డంగా దొరికిపోవ‌డంతో…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Nookaraju : నూక‌రాజు ఫోన్‌లో అలాంటి మెసేజ్‌లు.. ల‌వ‌ర్‌కి అడ్డంగా దొరికిపోవ‌డంతో…!

Nookaraju : బుల్లితెర‌పై త‌మ‌దైన హాస్యం పంచుతూ ప్రేక్ష‌కుల‌ని క‌డుపుబ్బ న‌వ్వించే క‌మెడీయ‌న్స్ లో నూక‌రాజు కూడా ఒకరు. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో పాల్గొని మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.మ‌నోడు ఆసియాతో క‌లిసి స్కిట్స్ చేసి ఆమెతో ప్రేమ‌లో ప‌డ్డాడు. ఇప్పుడు బుల్లితెర‌ క్యూట్ జోడీల్లో ఒకరైన జబర్దస్త్ నూకరాజు, ఆసియాలు రియల్ గానే ప్రేమలో ఉన్న‌ట్టు ఇంట‌ర్వ్యూలో తెలియజేశారు. అయితే జబర్దస్త్ షోను విడిచి వెళ్లిపోయిన ఆసియా.. ప్రస్తుతం యూట్యూబర్ […]

 Authored By ramu | The Telugu News | Updated on :10 May 2024,5:00 pm

ప్రధానాంశాలు:

  •  Nookaraju : నూక‌రాజు ఫోన్‌లో అలాంటి మెసేజ్‌లు.. ల‌వ‌ర్‌కి అడ్డంగా దొరికిపోవ‌డంతో...!

Nookaraju : బుల్లితెర‌పై త‌మ‌దైన హాస్యం పంచుతూ ప్రేక్ష‌కుల‌ని క‌డుపుబ్బ న‌వ్వించే క‌మెడీయ‌న్స్ లో నూక‌రాజు కూడా ఒకరు. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో పాల్గొని మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.మ‌నోడు ఆసియాతో క‌లిసి స్కిట్స్ చేసి ఆమెతో ప్రేమ‌లో ప‌డ్డాడు. ఇప్పుడు బుల్లితెర‌ క్యూట్ జోడీల్లో ఒకరైన జబర్దస్త్ నూకరాజు, ఆసియాలు రియల్ గానే ప్రేమలో ఉన్న‌ట్టు ఇంట‌ర్వ్యూలో తెలియజేశారు. అయితే జబర్దస్త్ షోను విడిచి వెళ్లిపోయిన ఆసియా.. ప్రస్తుతం యూట్యూబర్ గా సెటిల్ అయింది. వీడియోలు చేస్తూ తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంటుంది. అయితే అనేక షోలు చేస్తున్న నూకరాజు ఆమెకు అండగా నిలిస్తూ.. ఆమె వీడియోల్లో కనిపిస్తూ రచ్చ చేస్తున్నాడు.

Nookaraju అడ్డంగా బుక్..

తాజాగా ఆసియా.. జబర్దస్త్ నూకరాజు అసలు బాగోతాన్ని రివీల్ చేసింది. ఆయన మరో అమ్మాయితో చేసిన ఆ పని గురించి పబ్లిక్ గా చెప్పింది. దీంతో నూకరాజు ఆమెపై ఫైర్ అయి గొడవ పెట్టుకున్నాడు. లవ్ టుడే చిత్రంలో మాదిరి ఆసియా, నూకరాజు తమ మొబైల్స్ మార్చుకున్నారు. ఈ క్రమంలో నూకరాజు మొబైల్ ని చెక్ చేసిన ఆసియా షాక్ అయ్యింది. ఆసియా బలవంత పెట్టడంతో త‌న‌ ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ ల పాస్ వర్డ్ లను కూడా చెప్పాడు నూక‌రాజు. ఇలా ఆసియా కూడా అతడి ఫోన్ ను పూర్తిగా చెక్ చేసింది. అయితే ఓ అమ్మాయి ఓయ్ నూకరాజు, ఏయ్ రిప్లై ఇవ్వు.. అంటూ తెగ మెసేజ్ లు చేసింది. దీంతో ఆసియా చాలా కోప్పడింది. ఎంత క్లోజ్ నెస్ ఉంటే ఆ అమ్మాయి నిన్ను అలా పిలుస్తుంది చెప్పు అంటూ విసిగిస్తుంది.

Nookaraju నూక‌రాజు ఫోన్‌లో అలాంటి మెసేజ్‌లు ల‌వ‌ర్‌కి అడ్డంగా దొరికిపోవ‌డంతో

Nookaraju : నూక‌రాజు ఫోన్‌లో అలాంటి మెసేజ్‌లు.. ల‌వ‌ర్‌కి అడ్డంగా దొరికిపోవ‌డంతో…!

దీంతో ఫుల్ ఫైర్ అయిన నూకరాజు మరింత కోప్పడతాడు. నేను రిప్లై ఇవ్వలేను కదా ఎందుకు ఇంత చేస్తున్నావంటూ అఢుగుతాడు. ఆ స‌మ‌యంలో ఆసియా క‌న్నీళ్లు పెట్టుకుంటూ ఫేస్ బుక్ చెక్ చేస్తుంది. అందులో ఆ అమ్మాయే పుట్టిన రోజు విష్ చేయమని అడుగుతూ మెసేజ్ పెడుతుంది. ఆ అమ్మాయి.. లవ్ సింబల్ కూడా పంపింది. ఇది చూసిన ఆసియా తెగ ఫీల్ అయిపోయింది. ఏదైనా సంబంధం ఉంటే తప్ప ఇలా ఎవరూ మెసేజ్ చేయ‌రంటూ ఫైర్ అయింది. దీనికి ఫుల్ హర్ట్ అయిన నూకరాజు మైక్ విసిరేసి మరీ వెళ్లిపోయాడు. ఇక తర్వాత వీడియో అయిపోయిందని చెబుతూనే.. నూకరాజును బతిమాలుకోవాలి.. వీడియో కోసం నిజంగానే ఫోన్ తీసుకున్నానని.. అందులో చూసిన వాటికి అంతకంటే ఎక్కువ ఫీల్ అయ్యానని చెప్పుకొచ్చింది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది