Auto Ram Prasad : జబర్దస్త్ ట్రియో మళ్లీ స్టేజ్ పైకి.. ఆ రోజు గుండె బద్ధలైందన్న ఆటో రామ్ ప్రసాద్
ప్రధానాంశాలు:
Auto Ram Prasad : జబర్దస్త్ ట్రియో మళ్లీ స్టేజ్ పైకి.. ఆ రోజు గుండె బద్ధలైందన్న ఆటో రామ్ ప్రసాద్
AUto Ram Prasad : తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకమైన ఎమోషనల్ కనెక్ట్ ఉన్న హాస్య త్రయం సుడిగాలి సుధీర్, ఆటో రామ్ ప్రసాద్, గెటప్ శ్రీను. జబర్దస్త్ షో ద్వారా ప్రేక్షకుల మనసుల్లో చెరిగిపోని గుర్తింపును సంపాదించిన వీరు, ఇప్పుడు మళ్లీ ఒకే వేదికపై కనిపించి అభిమానులని అలరించారు.

Auto Ram Prasad : జబర్దస్త్ ట్రియో మళ్లీ స్టేజ్ పైకి.. ఆ రోజు గుండె బద్ధలైందన్న ఆటో రామ్ ప్రసాద్
Auto Ram Prasad : ఎమోషనల్ కామెంట్స్..
ప్రస్తుతం సర్కార్ సీజన్ 5 గేమ్ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సుడిగాలి సుధీర్ తాజా ఎపిసోడ్‌కు తన స్నేహితులు గెటప్ శ్రీను, ఆటో రామ్ ప్రసాద్, అలాగే సన్నీలని ఆహ్వానించారు. జబర్దస్త్ వేదికపై చక్కటి స్కిట్లు ఇచ్చిన ఈ ముగ్గురూ, ఎన్నో నవ్వుల్ని పంచిన స్నేహబంధానికి ఇప్పుడు కొత్త ప్రాణం పోసారు.ఈ ఎపిసోడ్‌లో ఆటో రామ్ ప్రసాద్ ఎమోషనల్ అయ్యారు.
“మనం దాదాపు 10 ఏళ్లు కలిసి పని చేశాం. ఒకరోజు మీరు ఇద్దరూ వెళ్లిపోయిన తర్వాత ఒక్కడినే స్టేజ్ ఎక్కాల్సి రావడం తట్టుకోలేకపోయాను. నా గుండె బద్దలైంది. ఏదో శక్తి వెనక్కి లాగుతున్నట్టే అనిపించింది అంటూ తన మిత్రులైన సుధీర్, శ్రీనుల గురించి ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ఆ మాటలు విని సుధీర్, గెటప్ శ్రీను, సన్నీ కూడా భావోద్వేగానికి లోనయ్యారు. “ఎప్పటికైనా మళ్లీ మన ముగ్గురం కలిసి ఒక కామెడీ షో చేయాలి” అంటూ రామ్ ప్రసాద్ మనసులో మాటను పంచుకున్నారు.