Auto Ram Prasad : జబర్దస్త్ షో నుంచి గెటప్ శ్రీను, సుధీర్ అవుట్.. ఒంటరిగా మిగిలిన ఆటో రాం ప్రసాద్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Auto Ram Prasad : జబర్దస్త్ షో నుంచి గెటప్ శ్రీను, సుధీర్ అవుట్.. ఒంటరిగా మిగిలిన ఆటో రాం ప్రసాద్

Auto Ram Prasad : జబర్దస్త్ షోలో గెటప్ శ్రీను, సుధీర్, ఆటో రాం ప్రసాద్ ఎంతగా ఫేమస్ అయ్యారో అందరికీ తెలిసిందే. ఆ తరువాత ఎక్స్ ట్రా జబర్దస్త్ అని పెట్టాక.. ఈ ముగ్గురూ మరింత ఫేమస్ అయ్యారు. ఈముగ్గురే ఎక్స్ ట్రా ప్రాణం, ఊపిరి. అయితే మధ్యలో కొన్ని కొన్ని సార్లు ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు డుమ్మా కొడుతూ ఉండేవారు. గెటప్ శ్రీను అయితే నెలలు నెలలు కనిపించకుండా పోయేవాడు. మధ్యలో ఆరోగ్య […]

 Authored By prabhas | The Telugu News | Updated on :19 May 2022,11:00 am

Auto Ram Prasad : జబర్దస్త్ షోలో గెటప్ శ్రీను, సుధీర్, ఆటో రాం ప్రసాద్ ఎంతగా ఫేమస్ అయ్యారో అందరికీ తెలిసిందే. ఆ తరువాత ఎక్స్ ట్రా జబర్దస్త్ అని పెట్టాక.. ఈ ముగ్గురూ మరింత ఫేమస్ అయ్యారు. ఈముగ్గురే ఎక్స్ ట్రా ప్రాణం, ఊపిరి. అయితే మధ్యలో కొన్ని కొన్ని సార్లు ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు డుమ్మా కొడుతూ ఉండేవారు. గెటప్ శ్రీను అయితే నెలలు నెలలు కనిపించకుండా పోయేవాడు. మధ్యలో ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో గెటప్ శ్రీను ఈ షోలకు దూరంగా ఉన్నాడు. అయితే ఇప్పుడు కూడా గెటప్ శ్రీను ఈ షోకు దూరంగానే ఉంటున్నాడు.గత నెల రోజులకు పైగా గెటప్ శ్రీను ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలో కనిపించడం లేదు.

సుధీర్, రాం ప్రసాద్ ఇద్దరే స్కిట్లను కిందా మీదా పడి లాక్కొస్తున్నారు. అయితే తాజాగా సుధీర్ కూడా హ్యాండ్ ఇచ్చినట్టు కనిపిస్తోంది. గెటప్ శ్రీను హీరోగా సినిమాలు చేస్తుండటంతో ఫుల్ బిజీగా మారిపోయాడు. ఇక సుధీర్ ఇతర షోలు,సినిమా ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉండటం వల్లే ఎక్స్ ట్రా జబర్దస్త్ షోకు రాకుండా ఉండొచ్చు. ఇలా మొదటిసారిగా వారిద్దరూ లేకుండా స్కిట్ చేస్తున్నాను అంటూ రాం ప్రసాద్ ఎమోషనల్ అయ్యాడు.ఈ వారం రాబోతోన్న షోకు అనిల్ రావిపూడి గెస్టుగా వచ్చాడు. నీ పేరు ఆటో కదా? మొదటి సారి నీ చక్రాలు లేకుండా స్కిట్ చేశావ్ నీకు ఎలా అనిపిస్తోంది? అంటూ రాం ప్రసాద్‌ను అనిల్ రావిపూడి ప్రశ్నించాడు.

Auto Ram Prasad Skit WIth out Getup Srinu Sudigali Sudheer In Extra Jabardasth

Auto Ram Prasad Skit WIth out Getup Srinu Sudigali Sudheer In Extra Jabardasth

దీంతో ఒక్కసారిగా రాం ప్రసాద్ ఎమోషనల్ అయ్యాడు. ఇలా చేయడం మొదటి సారి సర్.. మామూలుగా అయితే నీ డైలాగ్ ఇదిరా నా డైలాగ్ ఇదిరా అని చెప్పుకునే వాళ్లం.. అలా వచ్చి స్టేజ్ మీద చేసే వాళ్లం ఏదో ఒక మ్యాజిక్ క్రియేట్ అయ్యేది సర్.. కానీ ఇలా ఈ అందరితో ప్రాక్టిస్ చేయించడం, వాళ్లు లేకపోవడం బాధగా ఉందని చెప్పుకొచ్చాడు.మొత్తానికి రాం ప్రసాద్ మాత్రం ఇప్పుడు ఒంటరిగానే తన బండిలాక్కోవాల్సి వచ్చింది. ఇకపై రానున్న ఎపిసోడ్స్‌లోనైనా వారిద్దరూ కనిపిస్తారా? లేదా? అన్నది చూడాలి. ఇప్పటికే సుధీర్.. స్టార్ మా సూపర్ సింగర్ జూనియర్ షోకు హోస్ట్‌గా చేసేందుకు అక్కడకు వెళ్లిపోయాడు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది