Auto Ram Prasad : చివరి చూపు కూడా దక్కలేదట.. కంటతడి పెట్టించిన ఆటో రాం ప్రసాద్
Auto Ram Prasad : ఎప్పుడూ నవ్వించే ఆటో రాం ప్రసాద్ మొదటి సారిగా ఏడిపించేశాడు. తన ఫ్యామిలీ మొత్తాన్నీ శ్రీదేవీ డ్రామా కంపెనీ స్టేజ్ మీదకు తీసుకొచ్చాడు. తనది ఉమ్మడి కుటుంబం అని చెప్పి.. అందరినీ పరిచయం చేశాడు. దాదాపు అందులో డెబ్బై మంది దాకా ఉంటారు. అదంతా కేవలం తన తండ్రి తరుపున ఫ్యామిలీ అని అన్నాడు.
ఇప్పటికీ ఇలా అందరూ కలిసి ఉండటానికి కారణం తన నానమ్మేనని రాం ప్రసాద్ అన్నాడు. తన వల్లే ఇలా కలిసి ఉన్నామని, పెళ్లిళ్లు చేస్తే ఎక్కడికో వెళ్లాల్సి వస్తుందని వెనుక లైన్ ముందు లైన్ వాళ్లని చూసే పెళ్లి చేసేశారు.. అలా సింహాచలంలో లైన్ లైన్ అంతా కూడా తమ ఫ్యామిలీనేనని నవ్వించాడు.

Auto Ram Prasad Whole Family At Sridevi Drama Company
Auto Ram Prasad : నానమ్మపై రాం ప్రసాద్ ప్రేమ..
అయితే తన నానమ్మ చనిపోయిందని, అప్పుడు తాను చివరి చూపుకు నోచుకోలేదని కంటతడి పెట్టేస్తాడు. నైట్ ఫోన్ వస్తే.. వెంటనే బయల్దేరాను.. బస్సులు లేకపోతే.. లారీలు ఎక్కి వెళ్లాను. కానీ తాను వెళ్లే సరికి ఆలస్యమవ్వడంతో శవాన్ని తీసేశారని, అలా చివరి చూపు కూడా చూసుకోలేకపోయాను అంటూ రాం ప్రసాద్ కంటతడి పెట్టేసుకున్నాడు.
