Sridevi Drama Company : శ్రీదేవి డ్రామా కంపెనీలో మెరిసిన రైల్వే అనౌన్స్‌మెంట్ చేసే వ్యక్తి.. ఒక్కొక్కరిపై పంచ్‌లు అదిరాయి..!
ప్రధానాంశాలు:
Sridevi Drama Company : శ్రీదేవి డ్రామా కంపెనీలో మెరిసిన రైల్వే అనౌన్స్‌మెంట్ చేసే వ్యక్తి.. ఒక్కొక్కరిపై పంచ్‌లు అదిరాయి..!
Sridevi Drama Company : దక్షిణ భారత రాష్ట్రాలలో నివసించే ప్రజలకు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో నివసించే ప్రజలకు ఓ మహిళ గొంతు సుపరిచితం. ప్రయాణికుల కోసం రైల్వే స్టేషన్లలో రైళ్ల రాకపోకలపై ప్రజల దృష్టిని కోరుతూ రైలు ప్రకటన వినని వారు ఎవరూ ఉండకపోవచ్చు. ఆ మహిళ మరెవరో కాదు ప్రముఖ రేడియో ప్రసారకురాలు గాయని ఆలూరు గాయత్రి Gayathri.

Sridevi Drama Company : శ్రీదేవి డ్రామా కంపెనీలో మెరిసిన రైల్వే అనౌన్స్‌మెంట్ చేసే వ్యక్తి.. ఒక్కొక్కరిపై పంచ్‌లు అదిరాయి..!
Sridevi Drama Company ఇచ్చి పడేసిందిగా..
డిగ్రీ పూర్తి చేసిన తర్వాత, గాయత్రి ఆల్ ఇండియా రేడియో Radioలో పని ప్రారంభించింది. ఆ తర్వాత 2005 నుండి రైల్వేకి తన గొంతు అరువుగా ఇవ్వడం ప్రారంభించింది. తాజాగా ఆమె శ్రీదేవి డ్రామా కంపెనీలో మెరిసింది. తాజా ఎపిసోడ్ రైల్వేకి సంబంధించినది కావడంతో ఆమెని ప్రత్యేకంగా పిలిపించారు. ఆమె తన వాయిస్ వినిపిస్తూ తనదైన శైలిలో పంచ్‌లు విసిరింది.
ట్రైన్‌లో గ్యాస్ స్టవ్‌లు, సిలిండర్స్ Cylinder తీసుకువెళ్లడం నిషిద్దం అని అనౌన్స్ చేసి రోహిణిని దిగమని అంటుంది. అంటే ఆమెని సిలిండర్‌లా పంచ్ వేసింది. అప్పుడు రోహిణి నాతో పాటు లైటర్ నరేష్‌ని కూడా తీసుకువెళతానని అంటుంది. ఇక టిక్కెట్ లేకుండా ప్రయాణించిన వారికి బుల్లెట్ భాస్కర్ స్కిట్ లు 10 చూపించబడతాయి అని చెబుతుంది. అవకాశాల కోసం రూమ్ డోర్ దగ్గర నిలుచున్నట్టు ట్రైన్ డోర్ దగ్గర నిలుచోవద్దు అని అంటుంది. ట్రైన్‌లో మద్యపానం చేయకూడదు. సన్నీగారు ఇవన్నీ మీరు మానుకుంటే బెటర్ అని అంటుంది గాయత్రి.