Avatar Movie : అవతార్ మూవీ బిహైండ్ సీన్స్… వామ్మో ఇంత టెక్నాలజీని ఉపయోగించారా… వీడియో
Avatar Movie : ప్రస్తుతం సినిమాలలో సినిమాకు సంబంధించిన మేకింగ్ సీన్స్ ను ,బిహైండ్ ది స్క్రీన్ పేరు తో యూట్యూబ్ లో విడుదల చేయడం సర్వసాధారణంగా జరుగుతుంది. విజువల్ ఎఫెక్ట్స్ యూస్ చేసి వారి సినిమాలలో అద్భుతాలను ఎలా సృష్టిస్తున్నారు అనే ప్రతిదీ క్లియర్ గా చూపిస్తున్నారు. ఇక ఈ మధ్య విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమాలో పులితో ఎన్టీఆర్ చేసిన ఫైట్ సీన్ ని కూడా ఏ విధంగా తీశారో మేకింగ్ సీన్స్ లో చూపించారు. అయితే ప్రస్తుత కాలంలో విజువల్ ఎఫెక్ట్స్ అనేవి చిన్న సినిమాలలో కూడా ఉంటున్నాయి. ఇక అవతార్ సినిమాకు అయితే పూర్తిగా విజువల్ ఎఫెక్ట్స్ కీలకమని చెప్పాలి.అవతార్ అంటేనే అదొక అద్భుతమైన లోకం.
మనల్ని మనకు తెలియకుండానే ఓ అద్భుత ప్రపంచంలోకి మనల్ని తీసుకెళ్తుంది. ఇక అప్పుడెప్పుడో రిలీజ్ అయిన అవతార్ సినిమా ఎంత పెద్ద సంచలనాన్ని సృష్టించిందో, ఇక ఇటీవల విడుదలైన అవతార్ ది వే ఆఫ్ వాటర్ సినిమా అంతకుమించిన సంచలనాన్ని సృష్టిస్తుంది. ఇక ఆ క్రెడిట్ మొత్తం అవతర్ ను సృష్టించిన జేమ్స్ కామెరూన్ దని చెప్పాలి. జేమ్స్ కామెరూన్ అంటేనే మాస్ ఆఫ్ విజువల్ వండర్స్, మ్యాన్ ఆఫ్ మాస్టర్ పీస్ మూవీస్, మెన్ అఫ్ వరల్డ్ రికార్డ్స్. ఒక అందమైన ప్రపంచాన్ని సరికొత్తగా తెర మీద చూపించగల అద్భుత ఆవిష్కర్త సినీ బ్రహ్మ జేమ్స్ కామేరూన్. అలాంటి గొప్ప సినీ బ్రహ్మ సృష్టించిన ఓ అద్భుతం అవతార్. అయితే అవతార్ లోని విజువల్ వండర్ సినిమాను ఎలా రూపొందించారు
అనేది మేకింగ్ సీన్స్ ద్వారా సినీ మేకర్స్ చూపించారు. ఇటీవల అవతార్ బిహైండ్ ది సీన్స్ అనే పేరుతో ఈ వీడియోను విడుదల చేశారు. దీంతో వీడియో క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో అవతార్ సినిమాలోని పాత్రను ఎలా సృష్టించారు అన్నది స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఈ సినిమాలోని సన్నివేశాలు అంత అద్భుతంగా కనబడడానికి వెనుక ఎంత కష్టం ఉంటుందా అనేది తెలియజేశారు. ఇక ఈ వీడియో చూసినవారు సినిమాలో కనిపించే అద్భుతమైన సన్నివేశాలు వెనుక ఇంత శ్రమ ఉంటుందా అనిపిస్తుంది. ఇక ఈ మేకింగ్ సీన్స్ చూస్తే వావ్ అనకుండా ఉండలేరు. అంతలా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
