Home » Entertainment » Avinash Lend Money From Srimukhi Getup Srinu And Chammak Chandra
Entertainment

ఆ ముగ్గురి వద్ద అప్పు తీసుకుని జబర్దస్త్‌కు కట్టా.. అసలు విషయం చెప్పిన అవినాష్

Authored By
Admin
The Telugu News | Published on: December 24, 2020, 9:52 am
Advertisement

బిగ్ బాస్ షోలోకి వెళ్లేందుకు అవినాష్ ఎన్ని కష్టాలు పడ్డాడో అందరికీ తెలిసిందే. జబర్దస్త్ నుంచి సంకెళ్లు తెంచుకుని బిగ్ బాస్‌కు వెళ్లేందుకు భారీగానే మూల్యం చెల్లించుకున్నాడు. పది లక్షలు కడితేనే కానీ వెళ్లేందుకు అంగీకరించమని ఖరాఖండిగా చెప్పారట. అప్పులున్నాయి.. చాలా కష్టాల్లో ఉన్నానని చెప్పినా కూడా కనికరించలేదని అవినాష్ అన్నాడు. ఎనిమిదేళ్లు కలిసి పని చేశాను ఏదైనా సాయం చేస్తారేమోనని ఆశపడ్డానని అవినాష్ చెప్పుకొచ్చాడు.

Advertisement

Avinash Lend money from srimukhi getup srinu and chammak chandra

పది లక్షలు కాకుండా ఓ రెండు మూడు లక్షలు కట్టించుకుంటారని అనుకున్నాను కానీ పది లక్షలు కట్టే వరకు వదిలిపెట్టలేదని అవినాష్ చెప్పుకొచ్చాడు. ఆ సమయంలో ఏంచేయాలో పాలు పోలేదని డబ్బు ఎలా సమకూర్చాలో కూడా తెలియలేదని చెప్పుకొచ్చాడు. అప్పుడే శ్రీముఖి, గెటప్ శ్రీను, చమ్మక్ చంద్ర వద్ద అప్పు చేసిన జబర్దస్త్ వాళ్లకి కట్టాను.. అలా అక్కడి ఎన్‌ఓసీ తెచ్చుకున్నానంటూ అవినాష్ తన కథంతా వివరించాడు.

Advertisement

అయితే బిగ్ బాస్‌కు వెళ్లేందుకు పది లక్షలు కట్టినా కూడా.. అంతకంటే ఎక్కువే వచ్చిందని అవినాష్ చెప్పుకొచ్చాడు. ఆ పదిలక్షలు రిటర్న్ రావడమే కాదు.. ఉన్న అప్పులన్నీ కూడా తీరిపోయాయ్ అని అవినాష్ ఫుల్ ఖుషీగా చెప్పుకొచ్చాడు. ఇప్పుడు తాను హ్యాపీగా ఉన్నానని తెలిపాడు. అయితే జబర్దస్త్ వాళ్లు మళ్లీ పిలిస్తే వెళ్లాలని అనుకుంటున్నాను కానీ వారు మళ్లీ రావొద్దని అన్నారంటూ అవినాష్ చెప్పుకొచ్చాడు. మరి స్టార్ మా వాళ్లు అవినాష్‌తో ఏదో కామెడీ ప్రోగ్రాం రెడీ చేస్తోన్నట్టు టాక్ వినిపిస్తోంది.

Admin

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి